జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని.. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తనపై జానీ మాస్టర్ ఆత్యాచారం చేశాడంటూ సదరు యువతి ఫిర్యాదులో పేర్కోనడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు నార్సింగీ పోలీసులు. అయితే ఇటీవలే జానీని మాస్టర్ ను ఉప్పర్ పల్లి కోర్టులో హజరుపరచగా.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించింది. దీంతో జానీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే తాజాగా జానీ మాస్టర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్

 చోటుచేసుకుంది. జానీ కేసులో మరో ఇద్దరు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో తనపై అత్యాచారం జరిగినప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు అయిన మోయిన్, రాహుల్ తనతో ట్రావెల్స్ చేసినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. తనపై అత్యాచారం జరిగినప్పుడు వారు కూడా ఉన్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొనున్నారు. అయితే వారిద్దని నిందితులుగా కాకుండా సాక్ష్యులుగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిద్దరిని అదుపులోకి తీసుకుని, ముంబైకి వెళ్లిన సమయంలో జానీ మాస్టర్, ఆ యువతి మధ్య జరిగిన సంఘనలు,

 వారిద్దరి ప్రవర్తనలు ఎలా ఉండేది..వంటి సమాచారాన్ని పోలీసులు సేకరించనున్నరు.  ఇక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో జానీ భార్యపై కేసు నమోదు చేశారు. తనపై జానీ మాస్టర్ భార్య కూడా పలు రకాల వేధింపులకు గురి చేసినట్లు గతంలో ఆ యువతి తెలిపింది. మతం మార్చుకుని, తన భర్తను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన 40పేజీల ఫిర్యాదుపైనా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కస్టడీ కోరనున్నారు. అలాగే ఆయన భార్యపై కూడా ఆరోపణలు రావడంతో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: