టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని ఒకప్పుడు ఏలింది అక్కినేని నందమూరి కుటుంబ హీరోలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అక్కినేని గారు సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పట్లో చాలా సినిమాలు చేసి భారీ గుర్తింపును సంపాదించుకున్నారు. అలా వాళ్ళ గుర్తింపును కొనసాగిస్తూ వారి రెండవ తరం కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక అలా రెండవ తరం వారసులుగా వచ్చిన నాగార్జున బాలయ్య ప్రస్తుతం సీనియర్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నందమూరి కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నందమూరి నటి సింహం బాలకృష్ణ యంగ్ హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాదు హిట్ ల మీద హిట్ కొడుకు యంగ్ హీరోలకి సవాల్ విసిరుతున్నాడు. మరోవైపు

 అక్కినేని నాగార్జున సైతం ఒకప్పుడు భారీ హిట్ సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం బాగా డౌన్ అయ్యాడు అని చెప్పాలి. గత కొద్ది కాలంగా నాగార్జున చేస్తున్న సినిమాలేవి కూడా అంతగా సక్సెస్ అవ్వడం లేదు. అలా నందమూరి కుటుంబం పైకి వెళుతున్నప్పటికీ అక్కినేని కుటుంబం మాత్రం ఇంకా సక్సెస్ లోకి రావడం లేదు మరోవైపు అక్కినేని నందమూరి కుటుంబాల నుండి మూడో తరం వారసులు సైతం సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా నందమూరి కుటుంబాన్ని పెంచుతూ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ గుర్తింపును ఇంకా అలాగే కొనసాగిస్తున్నారు. కానీ అక్కినేని కుటుంబం నుండి మూడవ తరం వారసులుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అక్కినేని నాగచైతన్య అఖిల్ మాత్రం ఇంకా

 వెనుకబడే ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలకి ఇప్పటివరకూ సరైన సక్సెస్ అందలేదు నాగచైతన్య కాస్త అటు ఇటుగా సక్సెస్ అవుతున్నప్పటికీ ..అఖిల్ మాత్రం ముందు నుండి ఫ్లాప్ అవుతున్నాడు. అఖిల్ ఇప్పటివరకు చేసిన ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. ఇక ఈ మధ్యకాలంలో నాగచైతన్య చేస్తున్న సినిమాలో కూడా ఫ్లాప్ అవ్వడంతో నందమూరి కుటుంబాన్ని అక్కినేని కుటుంబం సినిమాల విషయంలో బీట్ చేస్తుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే నందమూరి కుటుంబంతో సమానంగా అక్కినేని కుటుంబం కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే కచ్చితంగా అఖిల్ నాగచైతన్య లకి ఒక మంచి మాస్ మసాలా సినిమా పడాలి.  అలా అయితే కచ్చితంగా వీరు నందమూరి కుటుంబాన్ని బీట్ చేయగలరు. అలాగే ఇటీవల నందమూరి కుటుంబం నుండి మోక్షజ్ఞ కూడా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: