త్రిబుల్ ఆర్ వంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న తాజా సినిమా దేవర . కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈమె తో పాటు ఇందులో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ట్రైలర్ పోస్టర్ అన్ని కూడా దేవరపై ఆసక్తిని పెంచేసాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ లో ఊర మాస్ లుక్ లో ఆకట్టుకున్నడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే సాంగ్స్ సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో

 ఉన్న ఇందులో భాగంగానే దేవర  సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ సైతం నిర్వహిస్తున్నారు చిత్ర బృందం.తాజాగా ఈ చిత్రం నుండి మరొక ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. యంగ్ టైగర్ మాస్ సంభవం అనే చెప్పాలి. ఈ చిత్రంలో టైగర్ ద్విపాత్రాభినయం చేసాడు. దేవర పాత్రలో ఎన్టీయార్ చెప్పిన ” భయం పోవాలంటే దేవుడి కథ వినాలా – భయం రావాలంటే దేవర కథ వినాల” సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాల’ వంటి డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారు అంతే స్థాయిలో అదే రీతిలో గ్రాండ్ స్కేల్ లో ట్రైలర్ కట్ చేసారు. కాగా నేడు సాయంత్రం 6: 00 గంటలకు దేవర ప్రీ రిలీజ్ వేడుక

 హైదరాబాద్ లోని నోవాటెల్లో  భారీ స్థాయిలో జరగబోతుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా దర్శకులు త్రివిక్రమ్, SS రాజమౌళి, ప్రశాంత్ నీల్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. అయితే ఈ రెండు ట్రైలర్లను బట్టి చూస్తే ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి సాధారణంగా రాజమౌళితో హిట్ కొట్టిన తర్వాత ఆ హీరో మరో సినిమా చేస్తే ఖచ్చితంగా అది ఫ్లాప్ అవుతుంది అన్న సెంటిమెంట్ ఉంది. ఇక రాజమౌళి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఆ సెంటిమెంట్ దేవరతో రిపీట్ అవుతుంది అని అందరూ భావిస్తున్నారు. కానీ ట్రైలర్ చూస్తే మాత్రం అలా కనిపించడం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: