కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన "దేవర పార్ట్ 1" సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. దీనికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ప్రమోషనల్‌ కంటెంట్ తో హైప్ పెంచేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా దేవర మూవీ నుంచి సెకండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దీనిలో కూడా విజువల్స్, యాక్షన్ సీన్లు, తారక్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇదొక ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమా లాగా కనిపిస్తోంది. తారక్‌ ఊర మాస్ అవతారంలో కనిపించాడు.

"భయం పోవాలంటే దేవుడి కథ ఇనాలా.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ ఇనాల.." అంటూ ఈ ట్రైలర్‌లో ఆలోచింపచేసే డైలాగ్స్ కూడా వినిపించాయి. ఈ డైలాగ్స్‌ను వింటుంటే దేవర క్యారెక్టర్ ను భయానికి పర్యాయపదంలా చూపించేలాగా ఉన్నారు. భయం, ధైర్యం, చంపుట, చావటం లాంటి ఎలిమెంట్స్ రెండు ట్రైలర్లలో బాగా హైలైట్ అయ్యాయి. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్లు ఎలా ఉంటాయో కూడా రెండో ట్రైలర్లలో స్పష్టంగా చూపించారు. జాన్వీ క్యారెక్టర్ రంగస్థలం సినిమాలో సమంత లాంటి మామూలు క్యారెక్టర్ లాగా కనిపిస్తోంది. దానికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదేమో అని తెలుస్తోంది.

క్రూరమైన నివాసులు ఉండే ఓ తీరప్రాంత గ్రామం నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. ఎన్టీఆర్ తన ప్రజలను ఆ క్రూరమైన నివాసుల నుంచి కాపాడుతూ ఉంటాడు. అదే ఈ సినిమా స్టోరీ లైన్ గా కనిపిస్తోంది. సెకండ్ ట్రైలర్లో కూడా సేమ్ అంతకుమించి పెద్దగా ఎలాంటి కొత్త విషయాలు చూపించలేదు. ట్రైలర్ 1, 2 వీడియోలలో రొటీన్ స్టఫ్ మాత్రమే కనిపించింది. కావాలనే చూపించినవే మళ్ళీ సెకండ్ ట్రైలర్ ద్వారా చూపించారా? అసలు సినిమా వేరే ఉంటుందా? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాలు మొత్తం దాచిపెట్టి, వాటిని థియేటర్లలోనే రివీల్ చేయాలని కొరటాల శివ భావిస్తున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. దేవరలో ఏదో మ్యాజిక్ ఉందని అంటున్నారు. కానీ ప్రస్తుతానికి దాన్ని దాచిపెడుతున్నారు. అదేంటి అనేది తెలియాలంటే మరొక ఐదు రోజులు వెయిట్ చేయక తప్పదు.

https://youtu.be/5cx7rvMvAWo?si=S9E4lYmULrHcOpun


https://youtu.be/HNYA6bqL6bU?si=fbNTkGAuuxdZgohe

మరింత సమాచారం తెలుసుకోండి: