టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర సినిమా హడావుడి బాగా కనిపిస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ముందస్తు బుకింగ్స్ లో 1.5 మిలియన్ డాల‌ర్ల‌ మార్కును దాటేసిన దేవర సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు మరో నాలుగు రోజులు టైం ఉంది. అప్పటికే దేవర కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 2.5 మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసి మూడు మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతుందని నార్త్ అమెరికా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ప్రస్తుతం దేవర సినిమాకు జరుగుతున్న ఫ్రీ బుకింగ్ పెట్టి చూస్తే ఫస్ట్ వీక్ పూర్తి అయ్యే లోపు దేవర సినిమాకు ఆరు మిలియన్లకు పైగా వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది ఏమైనా దేవర సినిమా రిలీజ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు ... కేవలం తెలుగు సినీ లవర్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా రిలీజ్ అయిన దేవర రిలీజ్ ట్రైలర్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తోంది ... ఓవ‌రాల్ గా దేవ‌ర సినిమాకు మంచి టాక్ వ‌స్తే సరికొత్త రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


మిక్కిలినేని సుధాకర్ - నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ సంయుక్తంగా దేవ‌ర ను రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత దర్శకుడు వ్యవహరిస్తున్న ఈ సినిమాలోషైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: