నందమూరి నటసింహం .. యువరత్న బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం కేవలం నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు మాత్రమే కాదు ... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రేమికులు ... తెలుగు ప్రజలు అందరూ కళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని గత ఐదారు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా టైమ్ లోనే నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. అప్పటినుంచి ఐదారు సంవత్సరాలు గా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై రకరకాల వార్తల వచ్చినా ఇప్పుడు ఏవి నిజం కాలేదు.


మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఖరారు అయింది. హనుమాన్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరినీ ఒక ఊపు ఊపేసిన యువ దర్శకుడు ప్రశాంత వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. అయితే ఈ క్రేజీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అంటూ నందమూరి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మరో రెండు నెలల పాటు మోక్ష‌జ్ఞ‌ చేత రిహార్సల్స్ చేయించి డిసెంబర్ మొదటివారం నుంచి షూటింగ్ ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నారట.


ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ ప్రాజెక్టు కూడా ఉండబోతుందని .. అయితే ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్ లను బేస్ చేసుకుని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ సరసన అతిలోక అందాల సుందరి దివంగత శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ నటిస్తుందని వార్తలు వైరల్ అయ్యాయి. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ మోక్షజ్ఞ అన్న ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: