ఓవరాల్ గా రెండు ట్రైలర్లు చూస్తుంటే దేవర పక్కా యాక్షన్ డ్రామా అని క్లారిటీ అయితే వచ్చేస్తోంది . ఈ రిలీజ్ ట్రైలర్ లో డ్రామాని యాడ్ చేస్తూ ఇందులో వుండే ప్రతి క్యారెక్టర్ ని చూపిస్తూ సాలిడ్ గా రిలీజ్ కు ముందు రెండో ట్రైలర్ కట్ చేశారనే అభిప్రాయం అయితే ఉంది. ఇక ట్రైలర్ లో .. భయం పోవాలంటే దేవుడి కథ ఇనాల, భయం అంటే ఏమిటో తెలియాలంటే దేవర కథ ఇనాల అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ కూడా ట్రైలర్ కు హైలెట్ అయ్యింది.
ఇక సముద్రం మీద ఒక దేవర వున్నాడు చాలు. కొండమీద ఇంకొ దేవరని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు బైర ఇది శ్రీకాంత్ క్యారెక్టర్ డైలాగ్ గా చెపుతాడు. అలాగే మరో కీలక పాత్రతో మరో పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిస్తారు. సముద్రం ఎక్కాలా.. సముద్రం ఏలాల ఇది బైర డైలాగ్. ‘ముందువుండేది మంచి రోజులు కాదు దేవర ... మన అనుకునేవాళ్లు ఎవరూ మనోళ్ళు కాదు ... కథలో మరో కీలక పాత్ర చెప్పిన డైలాగ్.
కొరటాల సినిమాల్లో డ్రామా బలంగా ఉండేలా చూస్తారు. ఈ రిలీజ్ ట్రైలర్ లో డైలాగులు వింటే దేవర కూడా ఇంపాక్ట్ ఫుల్ డ్రామా అని అర్థమవుతోంది. ట్రైలర్ లో విజువల్స్ స్ట్రైకింగ్ గా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లో మరో స్థాయిలో ఉన్నాయి. దేవర అడిగినాడంటే చెప్పినాడని అంటూ ఎన్టీఆర్ చేత పవర్ ఫుల్ గా చెప్పించే సీన్ సినిమాకు హైలెట్. ఏదేమైనా రెండు ట్రైలర్లు చూస్తుంటే దేవర పక్కా యాక్షన్ డ్రామా అని క్లీయర్ గా తెలుస్తోంది.