- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

దేవర వన్ సినిమా మరో నాలుగు రోజులలో థియేటర్లోకి దిగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తొలి ట్రైలర్ వచ్చింది .. అయితే ఆ ట్రైలర్లకు మిశ్రమ స్పందన వచ్చింది. ట్రైలర్ అంత గొప్పగా లేదు అన్న టాక్ ఎక్కువగా వినిపించింది. ఎన్టీఆర్ వీరాభిమానులు ... నందమూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినీ అభిమానులు కూడా దేవర తొలి ట్రైలర్ విషయంలో అంత సంతృప్తిగా లేరు అన్నమాట నిజం. ఇక ఇప్పుడు రెండో ట్రైలర్ రిలీజ్ చేశారు ... దీనికి రిలీజ్ ట్రైలర్ అని పేరు పెట్టారు .. రెండో ట్రైలర్ కాస్త డిఫరెంట్ గా వస్తుందని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ దేవర వన్ రిలీజ్ ట్రైలర్ కూడా మొదటి ట్రైలర్ చాయిల్లోనే వచ్చింది ... సముద్రం ఎరుపెక్క‌డం ... ఆయుధాలు ... డైలాగులు చెప్పటం ... నరుక్కోవడం ... రక్తం మొదటి ట్రైలర్ లో చూపించిన ఈ ఎలిమెంట్స్ అన్ని తాజాగా వచ్చిన రిలీజ్ ట్రైలర్ లోను ఉన్నాయి.


సేమ్ పాత్రలు అవే డైలాగులు ... కాకపోతే సన్నివేశాలు కొద్దిగా మారాయి. మొదటి ట్రైలర్లో పోలిస్తే రెండో ట్రైలర్లో స్పెషాలిటీ అయితే కనిపించింది. మొదటి ట్రైలర్లో ఎక్కువగా యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కనిపించాయి. రెండో ట్రైలర్లో యాక్షన్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా చూపించారు. మరియు ముఖ్యంగా దేవర కనిపించకుండా పోయాడనే విషయాన్ని మొదటి ట్రైలర్లు చెప్పగా ... కీలక టైంలో తిరిగి వచ్చినట్టు దేవర రెండో ట్రైలర్లు చూపించారు.


ఏదేమైనా రెండు ట్రైల‌ర్లు క‌ట్ చేయ‌డం లో దేవ‌ర క‌థ‌.. క‌థ‌నాలు ఎలా ఉండ‌బోతున్నాయ‌న్న దానిపై మేకర్స్ ఓ క్లారిటీ అయితే క‌ల్పించేశారు. ఇక సినిమా క‌థ‌.. క‌థ‌నాలు ఎలా ఉండ‌బోతున్నాయ‌న్న ది రేపు థియేట‌ర్ల‌లో చూసి తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: