వర్మ హీరోయిన్లను ఎంత హాట్ గా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే ఒక మలయాళ అమ్మాయితో కలిసి శారీ అనే ఒక సినిమాని కూడా మొదలుపెట్టారు. ఈ అమ్మాయి అసలు పేరు శ్రీ లక్ష్మీ సతీష్ అవ్వగా వర్మ ఈమెను ముద్దుగా ఆరాధ్య దేవి అని పిలుస్తూ ఉంటారు. తనని శారీలో చూసినప్పటి నుంచి వర్మ మంత్ర ముగ్దులు అయ్యి ఆమె మీద ఏకంగా ఒక సినిమాని తీయడానికి ట్రై చేయడమే కాకుండా తీశారు. ఇటీవలే శారీ సినిమాకి సంబంధించి టీజర్ పోస్టర్లు ,సాంగ్స్ , ట్రైలర్ అన్ని కూడా చాలా బోల్డ్ గానే కనిపిస్తున్నాయి.


వర్మ మరొకసారి తన హాట్ నెస్ తో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ఆరాధ్యను కూడా ఎన్ని యాంగిల్స్ లో చూపించారో ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. అలాగే ఇటీవలే ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో ఆరాధ్య దేవిని మరింత అందంగా చూపించడమే కాకుండా కుర్రాళ్లకు ఈ పాటలు చూడడం వల్ల కునుకు లేకుండా అయ్యేలా చేశారు వర్మ. ముఖ్యంగా ఆరాధ్యను అడవులలో జలపాతం వద్ద ఆమె అందాల ఆరబోతనే హైలెట్ చేశారు వర్మ.


ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో కుర్రాళ్ళు తెగ చూసేస్తూ ఉన్నారు. ఆరాధ్య దేవి, సత్య మధు ఇందులో కీలకమైన పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. శారీ సినిమా వల్ల ఆర్జీవి డెన్ అనే ఒక కొత్త మ్యూజిక్ ఛానల్ ని కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక తన సినిమాలోని సాంగ్స్ అన్నీ కూడా ఆ చానల్స్ నుంచే విడుదల అయ్యేలా ప్లాన్ చేశారు వర్మ. వర్మ క్రియేటివిటీకి ఎంత చెప్పినా తక్కువే.. ముఖ్యంగా అమ్మాయిలను అందాలను ఏ విధంగా చూపించాలో వర్మకి బాగా తెలుసు అందుకే ఇలా బోల్డ్ గా సినిమాలను తీస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: