జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుండి తాజాగా సెకండ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైల‌ర్‌లో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ఉండ‌డంతో మూవీ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ ట్రైలర్ లో దాదాపు మొదటి ట్రైలర్ చూపించిన విజువల్స్ నే చాలా వరకు చూపించారు. కాని, ఈ ట్రైలర్ లో కథను కాస్తా రీలీజ్ చేసినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలోనే..' నిన్న రేత్రి ఓ పిడా కళ వచ్చింది జోగులా.. సముద్రం మళ్లీ ఎరుపు అయినట్టు.. అది నా చేతులు మీదు అయినట్టు కనిపించింది.' అంటూ ఎన్టీఆర్ డైలాగ్ తో ప్రారంభమతోంది. కొన్ని యాక్షన్

 చూపిస్తూ.. ' భయం పోవాలంటే దేవుడి కథ వినాలి.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర గురించి వినాలా' అని ప్రకాశ్ రాజ్ డైలాగ్ పీక్స్ అనే చెప్పాలి. అంతేకాదు దాని తర్వాత హీరో శ్రీకాంత్.. 'సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు.. కొండమీద ఇంకో దేవరను తయారు చేస్తే.. అది మీకే మంచి కాదుభైరవ అంటూ వార్నింగ్ ఇచ్చే మాస్ డైలాగ్.. కేక పుట్టిస్తోంది. చివర్లో ఓ ముసలి క్యారెక్టర్ తో ' ముందుండేంది మంచి రోజులు కాదు దేవర.. మన అనుకునే వారు మనోళ్లు కాదు' అనే డైలాగ్ తో ఎదో గట్టి ప్లాష్ బ్యాక్ ఇది అనేలా ఉంది. ఇక లాస్ట్ డైలాగ్ ' సముద్రం ఎక్కాలా.. సముద్రం ఎలాలా..' అనే పవర్ ఫుల్ డైలాగులతో ట్రైలర్

 విడుదలైంది. నిజంగా ఈ ట్రైలర్ లోని ఒక్కొక్క సన్నివేశాలు, ఫైట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఆ ట్రైలర్ చూస్తున్న కొద్దీ మరోపారి చూడాలా అనేలా ఉంది. మొత్తానికి ఈ రెండు ట్రైలర్స్ తో సినిమా రిజల్ట్ పై ఒక అంచనా అయితే వేయగలుగుతున్నారు. అంతేకాదు ఈ రెండు ట్రైలర్లను చూస్తే ట్రైలర్లో ఏదో ఆసక్తికరమైన పాయింట్ దాచిపెడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ ఆసక్తికరమైన విషయం ఏంటి అన్నది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: