విజయ్ దేవరకొండతో గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ముందు రష్మికని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె వేరే సినిమాలతో బిజీ గా ఉండటం వల్ల కుదరలేదు. అందుకే మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ బోర్స్ కి ఈ ఆఫర్ దక్కింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినా భాగ్య శ్రీకి మంచి పాపులారిటీ వచ్చింది.
అమ్మడి గ్లామర్ ట్రీట్ కి మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. విజయ్ దేవరకొండ సినిమాతో హిట్ కూడా పడితే కచ్చితంగా అమ్మడు టాప్ లీగ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐతే విజయ్ తో సినిమా అంటే రష్మికకు చెక్ పెట్టినట్టే అంటున్నారు ఆడియన్స్. విజయ్ తో కలిసి నటించిన భామల్లో రష్మిక ది బెస్ట్ అనిపించుకుంది. అంతేకాదు వారిద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ రిలేషన్ కూడా ఉందని టాక్. ఐతే ఇప్పుడు భాగ్య శ్రీతో రొమాన్స్ వర్క్ అవుట్ అయితే మాత్రం రష్మిక ప్లేస్ ని భాగ్య శ్రీ ఆక్యుపై చేస్తుందని చెప్పొచ్చు. అది క్రేజ్ విషయంలోనే కాదు విజయ్ తో రొమాన్స్ విషయంలో కూడా అనేస్తున్నారు. మరి భాగ్యశ్రీతో రౌడీ బోయ్ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.