జూనియర్ ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్లో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలో ఓ కామన్ పాయింట్ ఉంది అది ఏమిటో తెలుసుకుందాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్గా మొదటగా బృందావనం అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో సమంత తో పాటు కాజల్ అగర్వాల్ కూడా హీరోయిన్గా నటించింది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్గా రెండవ సినిమాగా రామయ్య వస్తావయ్య అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో కూడా సమంత తో పాటు శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్గా మూడవ సినిమాగా రభస అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో కూడా సమంత తో పాటు ప్రణీత కూడా హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. సంతోష్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సమంత హీరోయిన్ గా నాలుగవ సినిమా గా జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది. ఇక ఈ సినిమాలో సమంత తో పాటు నిత్యా మీనన్ కూడా హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇలా ఇప్పటి వరకు ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో కూడా సమంత తో పాటు మరో హీరోయిన్ నటించింది. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలో కూడా సమంత తో పాటు మరో హీరోయిన్ ఉండడం కామన్ గా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: