బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ బిగ్ బాస్ నే టార్గెట్ చేస్తూ నానా మాటలు అన్నాడు అభయ్. అదేదో కామెడీగా అనుకున్నాడు అనుకోవడానికి లేదు. టాస్కుల్లో బిగ్ బాస్ నిర్ణయాన్ని తప్పుబట్టి అభయ్ నానా రచ్చ చేశాడు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున అభయ్ కి తను అన్న మాటలన్నీ చూపించి రెడ్ కార్డ్ చూపించారు. ఐతే ఆ కార్డ్ వాడి అప్పుడే బయటకు పంపించాల్సి ఉన్నా హౌస్ మెట్స్ రిక్వెస్ట్ తో ఆపేశారు.
ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అభయ్ కు అందరికన్నా తక్కువ ఓట్లు రావడంతో అతన్ని ఎలిమినేట్ చేశారు. ఆల్రెడీ శనివారం రెడ్ కార్డ్ చూపించి హౌస్ నుంచి వెళ్లిపో అన్నారు. అప్పుడు హౌస్ మెట్స్ రిక్వెస్ట్ చేస్తే నాగార్జున శాంతించాడు కానీ బిగ్ బాస్ టీం మాత్రం అభయ్ ని వదల్లేదు. నిజంగానే అతను ఓటింగ్ లో లీస్ట్ ఉన్నాడా అన్నది తెలియదు కానీ అభయ్ ని కావాలనే బయటకు పంపించారన్న వాదన వినిపిస్తుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 8 లో అభయ్ ది 3 వారాల స్వీట్ అండ్ షార్ట్ జర్నీ అతన్ని హౌస్ లో చాలామంది కంటెస్టెంట్స్ మిస్ అవుతారని చెప్పొచ్చు.