ఎన్టీఆర్ దేవర ఈవెంట్ లో భాగం అయ్యేందుకు తెలుగు రెండు రాష్ట్రాల నుంచి చాలామంది ఫ్యాన్స్ వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు. ఐతే ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంపై వారు ఈవెంట్ ని చేస్తున్న ష్రేయాస్ మీడియా మీద విరుచుకుపడుతున్నారు. తెలుగులో మంచి ఈవెంట్ ఆర్గనైజర్ గా పేరున్న శ్రేయాస్ మీడియా దేవర ఈవెంట్ ని సక్సెస్ చేయలేకపోయింది.
ఐతే ఫ్యాన్స్ మాత్రం దేవర ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు చాలా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. ఐతే ఈవెంట్ క్యాన్సిల్ అవుతుందని ఊహించలేదు కానీ ఫ్యాన్స్ ఈ కసి చూస్తుంటే సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. దేవర ఈవెంట్ క్యాన్సిల్ అది ఎలాంటి కారణంతో అయినా ఈ ఎఫెక్ట్ కచ్చితంగా సినిమా మీద పడుతుంది. దేవర ఫస్ట్ డే రోజు ఫ్యాన్స్ తమ ప్రతాపం చూపించేలా ప్రభంజనం చేసేలా ఉన్నారు. అసలే ఫ్యాన్స్ కాలర్ ఎగరేయడం ఖాయమని తారక్ చెబుతున్నాడు.. అందులోనూ ఈవెంట్ క్యాన్సిల్ అయినందన్న బాధ కూడా ఉంది. ఇవన్నీ కలిసి సినిమా ఏమాత్రం సక్సెస్ టాక్ వచ్చినా నెక్స్ట్ లెవెల్ లో రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు. దేవర ఈవెంట్ క్యాన్సిల్ పై ఎన్ టీ ఆర్ కూడా చాలా అప్సెట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఎలాంటి ఈవెంట్ లేకుండానే వెండితెర మీదే బొమ్మ చూసేయాలని ఫ్యాన్స్ కి పిలుపునిచ్చాడు ఎన్ టీ ఆర్.