* సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఎంట్రీ
* రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం
* మొదటి సినిమాతోనే పది లక్షల వరకు రెమ్యూనరేషన్
* రాజమౌళి సినిమా కోసం 120 కోట్ల రెమ్యూనరేషన్
 


టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఎంతోమంది హీరోలు ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 50 సంవత్సరాలు దాటినా కూడా ఆయన యంగ్ హీరోలానే కనిపిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని... బాల నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చారు మహేష్ బాబు. ఆయన తండ్రి కృష్ణ సినిమాలో కూడా.. బాల నటుడిగా నటించారు ప్రిన్స్ మహేష్ బాబు.


అయితే ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ ఇండియా హీరోగా ఆయన.. రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అతి త్వరలోనే రాజమౌళితో సినిమా కూడా చేసి పాన్ ఇండియా హీరోగా ఎదగనున్నారు మహేష్ బాబు. అయితే ఈ సినిమా కోసం 120 కోట్లు మహేష్ బాబు తీసుకునే ఛాన్సులు ఉన్నట్లు సమాచారం.


ఆయన ప్రస్తుతం మార్కెట్ 100 కోట్ల వరకు ఉంది. మహేష్ బాబు చిట్టచివరిగా చేసిన గుంటూరు కారం సినిమా.. యావరేజ్ గా ఆడింది. అయినప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఈ సినిమా కోసం 60 కోట్ల వరకు తీసుకున్నారట మహేష్ బాబు. అయితే..సినిమా బంపర్ హిట్ అయి ఉంటే... ఆయన రెమ్యూనరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.  బాల నటుడిగా  చాలా సినిమాలు చేసిన మహేష్ బాబు... రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చింది. తొలి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకున్నాడు మహేష్ బాబు.


అయితే ఈ సినిమా కోసం ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్య రెమ్యూనరేషన్ తీసుకున్నారట మహేష్ బాబు.ఆ కాలంలోనే.. అంత మేర మహేష్ బాబు తీసుకోవడానికి కారణం... అప్పటికే బాల నటుడిగా ఆయన రాణించడమే.అయితే ప్రస్తుత... పరిస్థితుల్లో మహేష్ బాబు ఏ సినిమా తీసిన కచ్చితంగా 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రాజమౌళి తో మహేష్ బాబు సినిమా చేస్తున్న నేపథ్యంలో... ఆ సినిమా 2000 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది.కాబట్టి ప్రిన్స్ మహేష్ బాబు ఈ సినిమా కోసం 120 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: