* బాహుబలితో తారా స్థాయికి చేరిన ప్రభాస్ క్రేజ్

* 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి తెలుగు హీరోగా  గుర్తింపు

* భారీ సినిమాలకు కేరాఫ్ గా మారిన యంగ్ రెబల్ స్టార్..



యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఎవరూ కూడా ఊహించని స్థాయిలో వుంది..ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ తారా స్థాయికి చేరింది..భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ గా మారిన పాన్ ఇండియా హీరో ప్రభాస్.. ప్రభాస్ సినిమా సినిమాకు బడ్జెట్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది..ప్రస్తుతం ప్రభాస్ 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ప్రభాస్ కెరీర్ మార్చేసిన సినిమా బాహుబలి.. ఆ సినిమా తరువాత ప్రభాస్ కెరీర్ ఊహించని స్థాయికి చేరుకుంది. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగింది. అయితే బాహుబలికి ముందు ప్రభాస్ రెమ్యూనరేషన్ చాలా తక్కువ తన మొదటి సినిమా ఈశ్వర్ కు ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఆ సినిమాకు ప్రభాస్ తీసుకుంది కేవలం 5 లక్షలు మాత్రమే..

ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా వర్షం ఆ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఆ సినిమాకు ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ.. కానీ ప్రభాస్ కి మొదటి హిట్ అంటే మాత్రం వర్షం సినిమా పేరే చెబుతారు.. ప్రభాస్ ని స్టార్ హీరోని చేసిన సినిమా ఛత్రపతి.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రభాస్ ని స్టార్ హీరోని చేసింది.. ఆ సినిమాతో ప్రభాస్ రేంజ్ కూడా మారిపోయింది.. ప్రభాస్సినిమా తరువాత 5 నుంచి 6 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడు.. సినిమా సినిమాకు ప్రభాస్ క్రేజ్ పెరుగుతుందటంతో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ వచ్చింది.. ప్రభాస్ బాహుబలికి ముందు చేసిన మిర్చి సినిమా సూపర్ హిట్ అయింది.. ఆ సినిమాకు ప్రభాస్ 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.


ఇక బాహుబలి సినిమాకు ప్రభాస్ 25 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారు.. 180 కోట్లతో తీసిన ఆ సినిమా ఏకంగా 650 కోట్లకు పైగా వసూలు చేయడంతో ప్రభాస్ కి మరింత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. కానీ ప్రభాస్ తెలివిగా రెమ్యూనరేషన్ కి బదులుగా లాభాల్లో షేర్ కోరినట్లు సమాచారం.. బాహుబలి తరువాత ప్రభాస్ సాహో సినిమాకు ఏకంగా 70 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.. ఆ తరువాత వచ్చిన సలార్, కల్కి సినిమాలకు ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. కల్కి సినిమా ఊహించని విజయం సాధించడంతో ప్రభాస్ రేంజ్ ఊహకందని స్థాయికి చేరింది..రాబోయే సినిమాలకు ప్రభాస్ ఏకంగా 150 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: