ఆచార్య’ విడుదలయ్యేంతవరకు దర్శకుడు కొరటాల శివ పరాజయం అన్న పదం ఎరుగని దర్శకుడుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న దర్శకుడు. అయితే ‘ఆచార్య’ ఘోరంగా పరాజయం చెందడంతో కొరటాల శివ హవా కు బ్రేక్ పడతామే కాకుండా మెగా ఫ్యాన్స్ దృష్టిలో టార్గెట్ కాబడ్డాడు. ఒక ఫిలిం ఈవెంట్ లో చిరంజీవి దర్శకులను పరోక్షంగా విమర్శిస్తూ చేసిన కామెంట్స్ అది కొరటాల శివను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడ జరిగింది.



ఇలాంటి పరిస్థితుల మధ్య ఈవారం విడుదల కాబోతున్న ‘దేవర’ కొరటాల స్టామినకు పరీక్షగా మారింది. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల చేసిన కామెంట్స్ పై మెగా అభిమానులు అర్థాలు వెతుకుతున్నారు. ‘దేవర’ సినిమాకు సంబంధించిన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు.



‘ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి పని వాళ్ళను చేసుకోనివ్వాలని అవసరం లేకపోయినా ఇబ్బంది పెట్టి మనం పని చేయకుండా అడ్డు పడితే దానికి బాధ్యత తీసుకోవడం కష్టం’ అంటూ కొరటాల చేసిన కామెంట్స్ ‘ఆచార్య’ ఫెయిల్యూర్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ అంటూ మెగా అభిమానులు కొరటాల కామెంట్స్ పై అర్థాలు వెతుకుతున్నారు.



వాస్తవానికి ‘ఆచార్య’ కథలో చిరంజీవి అనేక మార్పులు చేర్పులు చెప్పడంతో కొరటాల ఆ సూచనలకు అనుగుణంగా ‘ఆచార్య’ కథలో అనేక మార్పులు చేశాడు అన్న ప్రచారం జరిగింది. అంతేకాదు ‘ఆచార్య’ మూవీని కొరటాల తాము అనుకున్న విధంగా తీయలేకపోవడానికి గల కారణం మెగా కాంపౌండ్ ఈ మూవీ కథ విషయంలో చేసిన అనేక మార్పులు అని కూడ కొందరు అంటూ ఉంటారు. ఈవిషయాలు అన్నీ తన మనసులో పెట్టుకుని కొరటాల ‘దేవర’ మూవీ ప్రమోషన్స్ లో ఇలా కామెంట్స్ చేసి ఉంటాడు అని కొందరి అభిప్రాయం..  



మరింత సమాచారం తెలుసుకోండి: