‘ఆవారా’ ‘ఖైదీ’ ‘నా పేరు శివ’ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడ బాగా నచ్చడంతో అతడి సినిమాలను తమిళంతో పాటు తెలుగులో కూడ ఒకేసారి విడుదల చేస్తున్నారు. అయితే అతడి లేటెస్ట్ మూవీ ‘సత్యం సుందరం’ జూనియర్ ‘దేవర’ మూవీని లెక్క చేయకుండా వచ్చే వారం సెప్టెంబర్ 28న తెలుగు రాష్ట్రాలలో విడుదలచేయడం షాకింగ్ గా మారింది. విజయ్ సేతుపతి త్రిషల కాంబినేషన్ లో గతంలో విడుదలై సంచలనాలు సృష్టించిన ‘96’ లాంటి మ్యూజికల్ క్లాసిక్ మూవీని తీసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈసినిమాకు దర్శకుడు కావడంతో ఈమూవీ ఏమైనా ఊహించని సంచలనాలు చేస్తుందా అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు.
అయితే ఈమూవీలో పాటలు ఫైట్స్ ఏమాత్రం ఉండవని స్వయంగా కార్తీ చెప్పడంతో చాలామంది షాక్ అవుతున్నారు. కార్తీ లాంటి కమర్షియల్ హీరో చేస్తున్న ఈప్రయోగం ఎంతవరకు విజయవంతం అవుతుంది అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే కార్తీ మాటల ప్రకారం తన లేటెస్ట్ మూవీ ‘సత్యం శివం’ లో ఎటువంటి ప్రయోగాలు ఉండవని ఈసినిమాలో ప్రతి సీన్ లోనూ వాస్తవికత ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని ఈమూవీ పై అంచనాలు పెంచుతున్నాడు.
వాస్తవానికి కార్తీ సినిమాలను చూసే ప్రేక్షకులు తెలుగు రాష్ట్రాలలో ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మ్యానియాను పట్టించుకోకుండా ఈతమిళ హీరో సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే అది సంచలనం అవుతుంది. తమిళనాడులో కార్తీ సినిమాతో పోటీగా ‘దేవర’ విడుదలవుతోంది. అక్కడ జూనియర్ ఎలాంటి స్పందన ఉంటుంది అన్న ఆశక్తి మధ్య తెలుగు ప్రేక్షకులు కార్తీకి ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి..