జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతోంది.. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున నిన్నటి రోజున ప్లాన్ చేయగా ఊహించని విధంగా అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హోటల్ యాజమాన్య అద్దాలను కూడా పగలగొట్టడంతో పోలీసులు అభిమానుల మధ్య తోపులాట ఎక్కువ అవ్వడం చేత దీంతో ఈవెంట్ కూడా రద్దు చేశారు. దేవర చిత్రానికి ఇప్పటివరకు తెలుగులో చాలా తక్కువగానే ప్రమోషన్స్ చేశారు. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఆగిపోవడం  జరిగింది. దీంతో అభిమానులు నిరుత్సాహంతోనే ఉన్నారు.



రిలీజ్ లోపు దేవర సినిమా ప్రమోషన్స్ ని చిత్ర బృందం తెలుగులో చేస్తారా లేదా అనే అనుమానం అభిమానులలో మొదలయ్యింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఈరోజు ఉదయం అమెరికాకు వెళ్ళిపోయినట్లు అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాస్ ఏంజెల్స్ లో జరిగేటువంటి ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా దేవర సినిమాని ప్రదర్శించబోతున్నారట. ఎన్టీఆర్ కూడా దేవర సినిమా మొదటి షోని అక్కడే చూడడానికి మక్కువ చూపుతున్నారు. అందుకే అమెరికాకు ఈరోజు ఉదయమే ఎన్టీఆర్ పైన మైనట్టుగా తెలుస్తోంది. దేవర సినిమా రిలీజ్ సమయానికి కేవలం 3 రోజులు మాత్రమే ఉన్నది.


ఎన్టీఆర్ అమెరికాకి వెళ్లడంతో ఇప్పుడు తెలుగులో దేవర ప్రమోషన్ సినిమా లేనట్టుగా అనిపిస్తోందంటూ పలువురు అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. కానీ చిత్ర బృందం మీద మాత్రం అభిమానులు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చేయాలి అంటే ఒత్తిడి తెస్తున్నారు. rrr సినిమా సమయంలో కూడా ఎన్టీఆర్ మీడియా ముందుకు ఎక్కువగా కనిపించారు.. కానీ దేవర సినిమాకి మాత్రం ఇతర భాషలలో ఎక్కువగా ప్రమోషన్స్ చేశారు కానీ  తెలుగులో చాలా తక్కువగానే ప్రమోషన్ చేస్తున్నారు. మరి ఏమైనా సక్సెస్ మీటింగ్ ప్లాన్ చేస్తున్నారా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: