మోస్ట్ అవైటెడ్ మూవీ "దేవర" భారతదేశ వ్యాప్తంగా ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఇందులో జూ.ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ చేశాడు. ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ మూవీ. గ్రాఫిక్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికే రెండు ట్రైలర్ రిలీజ్ చేయగా అవి సినిమా ప్రేక్షకుల్లో హైప్‌ పెంచేసాయి. ఈ సినిమాలో తారక్‌ అద్భుతంగా నటించడానికి తెలుస్తోంది. మ్యూజిక్ కూడా బాగుంది. పైగా కొత్త హీరోయిన్. స్టోరీ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందని అనిపిస్తోంది. పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.

ఆర్‌ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీపై పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు రికార్డు స్థాయిలో ప్రీ బుక్ అవుతున్నాయి. అడ్వాన్స్ టికెట్లు ఆ రేంజ్ లో బుక్ అవుతున్నాయని తెలిసి.. ఓపెనింగ్స్ కూడా ఊహించని స్థాయిలో ఉంటాయని ట్రేడ్ పండితులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇండియాలో ఏ సినిమా కలెక్ట్ చేయనంత స్థాయిలో దేవర మూవీ ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఉంటాయని కూడా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఎవరైనా ఫ్లాపు చవిచూడాల్సిందే అనే ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. అయితే ఆ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రీ బుకింగ్ సేల్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద దేవర మూవీ సక్సెస్ అయినట్లే అని ఈ స్టాట్స్ చెబుతున్నాయి.

మరోవైపు యూఎస్‌లో ఫస్ట్ వీకెండ్‌లోనే ‘దేవర’ 4 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాలు తెలిపాయి.  ప్రీ టికెట్ల బుకింగ్ ద్వారా ఇప్పటికే 10 లక్షల డాలర్లు వసూలు అయినట్లు సమాచారం. ప్రిమియర్స్‌తోనే ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లు అందుకుంటుందని టాక్‌ నడుస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే శుక్ర, శని, ఆదివారాల్లో డైలీ 10 లక్షల డాలర్లు దేవర సినిమా వసూలు చేయవచ్చు. అదే జరిగితే దేవర మూవీ యూఎస్‌లో అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పవచ్చు. ఐమాక్స్ వెర్షన్‌లో కూడా ‘దేవర’ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి దీని కలెక్షన్స్ ఇతర సినిమాల కంటే ఎక్కువగా ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. యూఎస్‌లో ఇదే బాగా కలిసొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: