మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. రామ్ చరణ్ కొంత కాలం క్రితం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ లో ఓ చిన్న కీలక పాత్రలో చరణ్ నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

తాజాగా చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ కు ఏకంగా 90 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన తదుపరి మూవీ ని బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయనున్నాడు.  ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా , ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. శివరాజ్ కుమార్మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. గేమ్ చెంజర్ సినిమా కోసం 90 కోట్ల పారితోషకం పుచ్చుకున్న చరణ్ , బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కోసం ఏకంగా 125 కోట్ల భారీ పారితోషకం తీసుకోనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా చరణ్ సూపర్ సాలిడ్ రేంజ్ లో బుచ్చిబాబు సినిమా కోసం పారితోషకం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: