- 6 లక్షల రెమ్యూనరేషన్ తో మొదలై 60 కోట్ల వరకు..
- జూనియర్ మహాప్రస్థానం వెనుక మామూలు కష్టం లేదు..
జూనియర్ ఎన్టీఆర్ ని చాలామంది ఈయన ఓ పెద్దింటి కుటుంబానికి చెందిన హీరో అని అంటారు. నిజానికి పెద్దింటి కుటుంబానికి చెందిన హీరోనే కానీ ఆ కుటుంబం ఎన్టీఆర్ ను ఆదరించడానికి చాలా టైం పట్టింది. తన కష్టం మీద తాను ఎదిగిన తర్వాత ఆదరించారు.. కుటుంబం ఆదరించకపోయినా తన sr. ఎన్టీఆర్ మాత్రం ఎన్టీఆర్ ను చేరదీసి తన టాలెంట్ ను బయటకు తీశారు. తాత ఇచ్చిన బూస్టింగ్ తో మనవడు జూనియర్ ఎన్టీఆర్ చిన్న స్థాయి హీరో నుంచి పాన్ ఇండియా స్థాయి హీరో అయ్యారు.తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇంతటి స్థాయికి రావడానికి మామూలు కష్టపడలేదు. ప్రతిక్షణం ఎదుగుదల కోసం ఎంతో శ్రమించి చివరికి పాన్ ఇండియా స్థాయిలో హీరోగా నిలదొక్కుకున్నారు.అలాంటి జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని మూవీ నుంచి మొదలు దేవర సినిమా వరకు ఎలా ఎదిగారు.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే వివరాలు చూద్దాం.
ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ :
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన హీరోల పేర్లు చెప్పగానే చాలామంది గుర్తుకు వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.. ఈయన నటన పరంగా డ్యాన్స్ పరంగా అదరగొట్టేస్తారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ అదేది పట్టించుకోకుండా తన సొంత టాలెంట్ నే నమ్ముకుని ముందుకు వెళ్తారు. అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం నందమూరి కుటుంబానికి తలమానికంగా మారారని చెప్పవచ్చు. నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన అంచలంచెచలుగా ఎదిగి పాన్ ఇండియా స్థాయి హీరో అయ్యారు. అయితే ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి మామూలు కష్టం లేదని చెప్పవచ్చు. పెద్ద కుటుంబంలో పుట్టినా ఆదరణ లేని అవమానకర పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఒక్క సినిమా తీయడానికి కూడా ప్రొడ్యూసర్ దొరకని స్థాయి నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ సినిమాలు చేయడానికి డైరెక్టర్లు క్యూ కట్టే రేంజ్ కు ఎదిగాడు. ఆయన పేరులోను నటలలోను తాతను తలపించే విధంగా ఉంటారు.అలాంటి ఈయన ప్రస్తుతం ఒక గ్లోబల్ స్టార్. తన ప్రతిభతో తానే ఇండస్ట్రీలో ఎదగలిగారు. తాత ఆశీర్వాదం తల్లిదండ్రుల అండదండలతో ఇండస్ట్రీలో రాణించారు.