జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆఖరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అరవింద సమేత సినిమాతో ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. ఆఖరుగా ఎన్టీఆర్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ క్రేజ్ వచ్చింది.

తాజాగా తాజాగా ఎన్టీఆర్ "దేవర పార్ట్ 1" అనే సినిమాలో హీరోగా నటించాడు. కొరటాల శివమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నోవేటెల్ హోటల్లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక తమ అభిమాన హీరోను చూసేందుకు ఎన్టీఆర్ అభిమానులు నోవేటెల్ హోటల్ దగ్గరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయానికి పెద్ద మొత్తంలో చేరుకున్నారు. దానితో దాని కెపాసిటీ అస్సలు సరిపోలేని పరిస్థితులు ఏర్పడడం , అక్కడ ఒక్క సారిగా జనాలు విపరీతంగా రావడంతో ఈ సినిమా నిర్మాణ సంస్థ , ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తున్న శ్రేయస్ సంస్థ ఏమీ చేయలేక చేతులెత్తేసింది. దానితో తారక్ అభిమానులంతా ఈ మూవీ నిర్మాణ సంస్థను , ఆర్గనైజ్ చేస్తున్న శ్రేయస్ సంస్థను ముందే ఎన్టీఆర్ క్రేజీ ను అంచనా వేయాల్సింది.

భారీ సంఖ్యలో జనాలు వస్తారు అని పసిగట్టి పెద్ద గ్రౌండ్ ను సెలెక్ట్ చేసుకోవాల్సింది .ఇలా చేయడం ఇంతవరకు కరెక్ట్ అని నెగటివ్ వార్తలు రాసాగాయి. దానితో ఎన్టీఆర్ స్పందించి ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు బాధపడుతున్నాను. కానీ ఇందుకు నిర్మాణ సంస్థ కానీ  ఈవెంట్ ఆర్గనైజ్జేషన్ కానీ బాధ్యులు కాదు అని చెప్పుకొచ్చాడు. దీనితో ఈ సినిమా నిర్మాణ సంస్థపై , శ్రేయస్ మీడియా సంస్థపై నెగటివ్ కామెంట్స్ తగ్గిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: