- 100 రూపాయలతో మొదలైన బన్నీ తొలి సంపాదన..
- నేషనల్ అవార్డుతో టాలీవుడ్ లో సెన్సేషన్..
- నటనలో బన్నీని మించిన వారు లేరు..


 అల్లు అర్జున్.. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే..అయితే ఆయనను ఇండస్ట్రీ టార్గెట్ చేస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం ఆయనకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కొన్ని ఇష్యూస్, కోల్డ్ వార్లు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అలాంటి అల్లు అర్జున్ మొదటి పారితోషికం ఎంత.. సినిమా సినిమాకి మధ్య తనా రేంజ్ ఎలా పెరిగింది అనేది ఇప్పుడు చూద్దాం..

రికార్డ్ రెమ్యూనరేషన్:  
అల్లు అర్జున్ మొదటి సంపాదన 100 రూపాయలు.. ఇక అసలు విషయం ఏమిటంటే.. బన్నీ చిన్నతనంలో చిరంజీవి బర్త్డే రోజు అందరూ డాన్స్ లు చేస్తున్న సమయంలో బన్నీ కూడా డాన్స్ చేశారట. అలా బన్నీ డ్యాన్స్ చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఫిదా అయిపోయి వెంటనే బన్నీ దగ్గరకు వెళ్లి వంద రూపాయలు నోట్ తీసి ఆయన చేతిలో పెట్టారట.అంతేకాదు పెద్దయ్యాక వీడిని నేనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను అని అల్లు అర్జున్ తల్లికి మాటిచ్చారట. అలా ఇచ్చిన మాట ప్రకారమే రాఘవేందర్రావు అల్లు అర్జున్ ని ఇండస్ట్రీకి హీరోగా గంగోత్రి మూవీతో పరిచయం చేశారు. అయితే ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఈ మూవీలో అల్లు అర్జున్ లుక్స్ పట్ల చాలామంది విమర్శలు చేశారు. అమ్మాయిలా ఉన్నాడు వీడెం హీరో అవుతాడు అని ఎంతోమంది ట్రోల్స్ కూడా చేశారు. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో కొంత మంది అల్లు అర్జున్ అంటే పడని వాళ్ళు బన్నీ ఫేస్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ బన్నీ ని ఎంత తొక్కినా మళ్ళీ అంతకు రెట్టింపు వేగంతో పైకి ఎదుగుతున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరో కూడా అందుకోనటువంటి జాతీయ చలన చిత్ర ఉత్తమ నటుడి అవార్డు అందుకొని టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించారు. అయితే అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

 
 పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ తన సత్తా ఎలాంటిదో నిరూపించుకున్నారు.ముఖ్యంగా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకి ఎంతోమంది ఫిదా అయిపోయారు. సాధారణంగా చాలామంది హీరోలు ఇలాంటి పాత్రల్లో నటించడానికి అస్సలు ఒప్పుకోరు. తమ అభిమానులు ఆ పాత్రలో నటిస్తే ఆదరిస్తారో లేదో అని వెనకడుగు వేస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అస్సలు పట్టించుకోరు.అభిమానులైతే ఏ పాత్రలో ఉన్నా కూడా హీరోని ఆదరిస్తారు అని అనుకుంటారు.అలా పుష్ప సినిమాలో ఆయన నటనకి ఎంతోమంది ఫిదా అయ్యారు. అంతేకాదు ఆ సినిమాలో ఉన్న తగ్గేదేలే డైలాగ్ చిన్నవారి నుండి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరి నోళ్లలో నానుతోంది.. ఇక బన్నీ నటనలోనే కాదు డాన్స్ లో కూడా తనకు తానే పోటీ. అల్లు అర్జున్ డాన్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలా అల్లు అర్జున్ 100 రూపాయల పారితోషికంతో మొదలై ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే రేంజ్ కి ఎదిగారు. బన్నీ నటించిన పుష్ప సినిమాకి గాను 45 నుండి 50 కోట్ల మధ్యలో  రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే పుష్ప సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప -2 మూవీకి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేశారు. ఈ మూవీకి బన్నీ రెమ్యూనరేషన్ దాదాపు 150 కోట్లు ఉంటుందని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: