* క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలో ఎంట్రీ..!
* అసిస్టెంట్ డైరెక్టర్గాను మెరిపించిన రవితేజ.!
* కేరిర్ మొదట్లో వందల్లోనే పారితోషకం.?
* 100కోట్లు కోల్లగొట్టిన 'ధమాకా' మూవీ.!

(ఏపీ-ఇండియాహెరాల్డ్): ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ మాత్రమే కాదు.. బ్యాగ్రౌండ్ కూడా ఉండాలి. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు అందులో ఒకరు మాస్ మహారాజ్ రవితేజ.ఆయన ఇండస్ట్రీలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి ఎన్నో సూపర్ హిట్ట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న నటుల్లో ఒకరు మాస్ మహారాజ్ రవితేజ.ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆయన ఎన్నో అవమాలు, కష్టాలు పడినట్లు స్వయంగా రవితేజనే పలు ఇంటర్వ్యూలో అన్నారు.స్వ శక్తిని నమ్ముకున్న రవితేజ మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. ఆ పై చిన్ని పాత్రలతో తెరంగేట్రం చేసినా తన మ్యానరిజమ్ తో బడా దర్శకులను అట్రాక్ట్ చేసాడు. హీరో గా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

రవితేజ పూర్తి పేరు రవి శంకర్ రాజు భూపతి రాజు..1968 జనవరి 26న తూర్పు గోదావరి జిల్లా జగ్గాం పేటలో జన్మించాడు. తల్లిదండ్రులు రాజ్ గోపాల్ రాజు, రాజ్య లక్ష్మీ భూపతి రాజు.  చిన్న నాటి నుండే సినిమాల మీద అమితాసక్తితో ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి నిలదొక్కుకున్నాడు. వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. కర్తవ్యం సినిమాతో తెరంగేట్రం చేసిన రవితేజ చైతన్య, అల్లరి ప్రియుడులాంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించాడు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న రవితేజకి  సోలో హీరోగా అవకాశం వచ్చిన చిత్రం నీ కోసం...శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఫీస్ దగ్గర పర్వాలేదనిపించినా రవితేజకు  నంది  స్పెషల్ జ్యూరీ అవార్డు తెచ్చి పెట్టింది.ఈ సినిమా తరువాత హీరోగా అవకాశాలు రాకపోయినా క్యారెక్టర్ ప్రాధాన్యమున్న పాత్రలు చాలా వచ్చాయి. వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోని రవితేజ వాటిల్లోనూ తన సత్తా రుజువు చేసుకున్నాడు. ఈ సమయంలోనే రవితేజకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం,ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి చిత్రాలతో తిరుగులేని మాస్ మహారాజాగా అవతారం ఎత్తాడు రవితేజ. ఈ సినిమా తర్వాత రవి ఇక వెనక్కి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఆఫర్లే రవితేజ వెంట నడిచాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.రవితేజ హీరోగా తెరకెక్కిన తొలి సినిమా నీకోసం కాగా ఈ సినిమాకు రవితేజ పారితోషికం 20,000 రూపాయల కంటే తక్కువని సమాచారం. క్రాక్ సినిమాకు రవితేజ 12 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ అందుకుంటే ప్రస్తుతం 'ధమాకా' మూవీతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం 40-50కోట్ల రెమ్యూనరేషన్ రేంజ్లో ఉండడం గమనార్హం. అయితే సెకండ్ గ్రేడ్ హీరోల్లో రవితేజ టాప్ లో ఉన్నట్లు సమాచారం.ఇటీవల ఓ మూవీ షూటింగ్లో జరిగిన సంఘటన వల్ల అతనికి సర్జరీ చేసి కొంత కాలం షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే ఆయన అభిమానులు తొరగా కొల్కొని మరల షూటింగ్ లో పాల్గొనాలని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: