కొంత మంది సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు తాము నటించిన కొన్ని సినిమాలలో వేరే హీరోలకు వీరాభిమానుల పాత్రలలో నటించారు. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

మాస్ మహారాజా రవితేజ "ఇడియట్" అనే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని పాత్రలో నటించాడు. అందులో భాగంగా ఈ సినిమాలో ఓ సన్నివేశం కూడా ఉంటుంది. ఆ సన్నివేశం అద్భుతమైన స్థాయిలో సక్సెస్ కూడా అయింది. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.

రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బుజ్జిగాడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రభాస్ , సూపర్ స్టార్ రజనీ కాంత్ కు వీరాభిమాని పాత్రలో కనిపించాడు.

నాచురల్ స్టార్ నాని కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి హను రాగవపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని , నందమూరి బాలకృష్ణ కు వీరాభిమాని పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.

డాన్స్ కొరియో గ్రాఫర్ గా , నటుడిగా , దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాఘవ లారెన్స్ కొన్ని సంవత్సరాలు క్రితం స్టైల్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఈయన మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని పాత్రలో నటించాడు.

నితిన్ ఈయన బయట కూడా ఎన్నో సార్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే నితిన్ చిన్నదాన నీకోసం సినిమాలో పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని పాత్రలో కనిపించాడు.

ఇలా హీరోలతో పాటు మరి కొంత మంది హీరోలు కూడా తమ సినిమాలలో వేరే నటులకు వీరాభిమాని పాత్రలలో కనిపించిన సందర్భాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: