కొన్ని వారాలు మూవీ లవర్స్ కి అద్భుతమైన ట్రీట్ ఉంటూ ఉంటుంది. అది ఎలా అనుకుంటున్నారా..? కొన్ని వారాలలో ఇటు థియేటర్స్ లలో , అటు ఓ టీ టీ లో అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో సినీ లవర్స్ కి ఎటు మొగ్గు చూపాలో తోచని పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి ఈ వారం రాబోతుంది. అది ఎలా అనుకుంటున్నారా..? అసలు విషయం లోకి వెళితే ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్గా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు , మామూలు సినీ ప్రేమికులు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇలా దేవర మూవీ ఈ వారం విడుదల కానుండడంతో ఈ సినిమాను థియేటర్లలో చూద్దాం అని ఆశిస్తూ ఉండగా , మరో వైపు కొన్ని రోజుల క్రితం నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొంది బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సరిపోదా శనివారం సినిమా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో సెప్టెంబర్ 26 వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.

ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా ఇప్పటికే హిట్ అయి ఉండడం మరో సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ప్రేక్షకులు దేని వైపు మొగ్గు చూపాలో అర్థం కాకుండా పోయే పరిస్థితి ఉంది. కొంత మంది సినీ లవర్స్ కు మాత్రం అటు థియేటర్లో , ఇటు ఓ టీ టీ లో మంచి కంటెంట్ రాబోతుంది. దానితో వారు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: