నందమూరి బాలకృష్ణ , మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే సినీ ల‌వ‌ర్స్ ఎంత‌లా ఊగిపోతారో చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా - లెజెండ్ - అఖండ సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొక‌టి హిట్ అయ్యాయి. అస‌లు అఖండ సినిమా అయితే థియేట‌ర్ల లో సినిమాలు చూస్తోన్న ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌చ్చేశాయి. ఇక ఇప్పుడు వీరిద్ద‌రి కాంబోలో  ‘ అఖండ 2 ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుంది అంటూ బాల‌య్య ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు ... తెలుగు సినీ ప్ర‌జ‌లు అంద‌రూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.


ఈ క్రమంలో ఈ సినిమా పై చాలా పుకార్లు వినిపించాయి. ప్రస్తుతానికి అయితే అఖండ 2 లో నటించే నటీనటుల కోసం బోయపాటి చాలా పెద్ద‌ కసరత్తులు చేస్తున్నారు. పాత్రల గెటప్ ల‌తో పాటు సెటప్ ల పై ప్రత్యేకంగా 3 డి స్కెచెస్ కోసం వ‌ర్క్ లు చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను బోయపాటి రాసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి సంజయ్ దత్ పాత్ర అస్స‌లు ఎవ్వ‌రూ ఊహించ‌ని రేంజ్ లో ఉంటుంద‌ని టాక్ కూడా ఉంది?


ఇక ఇప్ప‌టికే అఖండ 2 పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక అఖండ 2 క‌థ ప్ర‌కారం ఈ సినిమా పూర్తిగా  శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో క‌థ .. క‌థ‌నాలు ఉంటాయ‌ని టాక్ ? ఇక హిందూ దేవాల‌యాల‌కు సంబంధించిన ప‌లు రిప‌రెన్సు లు కూడా సినిమాలో ఉంటాయ‌ని ... దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: