యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... జాన్వీ కపూర్ ఈ మూవీ లో ఎన్టీఆర్ కి జోడి గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయింది. దానితో తారక్సినిమా విడుదల ముందు ఏదో ఒక ఈవెంట్ ను నిర్వహించి అందులో ప్రసంగిస్తాడు అని ఈయన అభిమానులు అనుకున్నారు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్సినిమా విడుదలకు ముందే అమెరికాకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల అయ్యాకే ఇండియాకు తిరిగి రానున్నట్లు సమాచారం.

ఇకపోతే ఒక వేళ సినిమా కనుక బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టినట్లయితే ఎన్టీఆర్ ఏదైనా ఒక ఈవెంట్ ను పెట్టి అందులో మాట్లాడే అవకాశం ఉంది. సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చిన , కలెక్షన్లు బాగా రాకపోయినా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లు ఉండే అవకాశం చాలా తక్కువ శాతం ఉన్నాయి. మరి ఈ సినిమా ఇలాంటి టాక్ ను తెచ్చుకొని , ఏ రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: