ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 ఫీవర్ నడుస్తోంది. టీఆర్పిలో ఈ షో మిగతా షోలకంటే కూడా ఫస్ట్ ప్లేసులో ఉన్నట్టు సమాచారం. కాగా తాజాగా ఈ షో 3వ వారం నడవగా... అభయ్ నవీన్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం ఎపిసోడ్లోనే అతనికి హోస్ట్ నాగార్జున, రెడ్ కార్డ్ చూపించి మరీ హౌస్ నుంచి వెళ్లిపోమని చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. ఈ క్రమంలో మిగతా కంటెస్టెంట్స్ నాగార్జునని శాంతింప చేశారు. ఐతే ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్న అభయ్ ఈ వారం పెద్దగా పర్ఫార్మ్ చేయక పోవడంతో ఓటింగ్లో కూడా లీస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. సో అలా పృధ్వి, అభయ్ లలో అభయ్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది.

కాగా ఈ ఎలిమినేషన్ చూశాక, శనివారమే అభయ్ ని హౌస్ నుంచి పంపించొచ్చు కదా! అనే అనుమానం ఆడియన్స్ మదిలో కలిగింది. కానీ ఓటింగ్ ప్రకారం కూడా అభయ్ లీస్ట్ లో ఉన్నాడనే విషయం వాళ్లకి తెలియదు. ఇక వివరాల్లోకి వెళితే, వెళ్తూ వెళ్తూ అభయ్ ని 3 బ్లాక్, 3 రెడ్ రోజ్ లను హౌస్ మెట్స్ కి ఇవ్వమని కోరగా... అభయ్ బ్లాక్ రోజ్ లను మణికంఠ, విష్ణు ప్రియ, పృధ్వి లకు ఇచ్చి, రెడ్ రోజ్ లను నిఖిల్, సీతతో పాటుగా 3వ రోజ్ ని నబీల్, సోనియాలకు షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో అభయ్ ఎలిమినేటి కావడానికి గల కారణాలను పరిశీలిస్తే... అతని నోటి దురుసు తనమే అతనిని ఎలిమినేట్ చేసిందని చెప్పుకోవచ్చు.

హౌస్‌లో గుసగుసలాడిన విషయాలను అభయ్ నిఖిల్ చెవిలో చెప్పేవాడు. ఆ తరువాత.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికీ యత్నించేవాడు. ఓ సందర్భంలో ‘నేనైతే బిగ్ బాస్‌నే తిట్టిపడేస్తా కదరా.. నాలా ఉండాలి’ అన్నట్టుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. దాన్ని నాగార్జున బాగా గమనించారు. ఆ తరువాత ఆదిత్య ఓం దగ్గర.. కూడా మళ్లీ అదే డబ్బా కొనసాగించాడు అభయ్. ఎవరు ఏమనుకున్నా.. నేను చెప్పాల్సింది చెప్తా అన్నా.. అది నా క్యారెక్టర్ అంటూ గొప్పలు పోయేవాడు. ఈవారం నాకు అదే బ్యాడ్ అయ్యిందేమో! అని కూడా ఓ సందర్భంలో రియలైజ్ అయినట్టు కనబడ్డాడు.  కానీ అప్పటికే చేయి దాటిపోయింది.. కట్ చేస్తే అభయ్ ఎలిమినేట్ అయ్యాడు!

మరింత సమాచారం తెలుసుకోండి: