కొంత మంది సినిమా కథల విషయంలో పక్కా క్లారిటీగా ఉంటారు. ఎంత సన్నిహితులు అయిన సరే సినిమా కథ చెప్పినప్పుడు ఆ కథ నచ్చినట్లయితే వెంటనే దానిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే నిర్మాత లేదా దర్శకుడితో ఎంత మంచి స్నేహం ఉన్నా కూడా చివరగా ఆడియన్స్ నుండి సినిమాకు మంచి టాక్ రావాలి. అలా రానట్లయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం దాని ద్వారా చాలా మంది కి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దానితో కొంత మంది కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అనుకుంటేనే ఆ మూవీ ని ఓకే చేస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది హీరోలు మాత్రం కొన్ని సందర్భాలలో చిన్న చిన్న మొహమాపటాల వల్ల సినిమా చేస్తూ ఉంటారు.

ఇకపోతే కొంత కాలం క్రితం దిల్ రాజు బ్యానర్లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిస్టర్ పర్ఫెక్ట్ అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా సెట్ కావడం ముందు జరిగిన కొన్ని విషయాలను దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అందులో బాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... దశరథ్ నాకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కథ చెప్పినప్పటి నుండి ఆయనతో ట్రావెల్ చేస్తూ వచ్చాను. ఆ మూవీ ప్రభాస్ కి బాగుంటుంది అనుకున్నాను. ఆయన మలేషియాలో ఉన్న సమయంలో దశరథ్ తో ఫోన్లో కథ ను చెప్పించాను. ఆయన కథ మొత్తం విని ఫస్ట్ అఫ్ బాగుంది , సెకండ్ బాగోలేదు అన్నాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ మలేషియా నుండి వచ్చాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేశాను... కథ వింటావా అన్నాను. అయితే ప్రభాస్ మొహమాటానికి ఖాతా విని నో చెప్పుదాం అని నా దగ్గరికి వచ్చాడట.

ఇక కథ చెప్పడం మొదలు పెట్టాడు. కథ మొత్తం పూర్తి అయ్యాక సినిమా కథ సూపర్ గా ఉంది చేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఆయన నాతో ఈ సినిమా ఖచ్చితంగా చేయొద్దు అనుకున్నాను. కానీ మీరు సూపర్ గా కథను డెవలప్ చేశారు. అందుకే నేను ఈ సినిమా చేస్తున్నాను అని అన్నాడు ... అన్నట్లుగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: