టాప్ హీరోల సినిమాల విడుదలకు ముందు ఏర్పాటు చేసే ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి అతడి అభిమానులు మాత్రమే కాకుండా సినిమా అభిమానులు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఈవారం విడుదల అవుతున్న నేపధ్యంలో ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అత్యంత ఘనంగా జరిగి ఈమూవీ పై అంచనాలను మరింత పెంచుతుందని ఈమూవీ బియ్యర్లతో పాటు తారక్ అభిమానులు కూడ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే జగింది వేరు.


ఎవరు ఊహించని విధంగా ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడానికి అనేక కారణాలు విశ్లేషణలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ ను నోవాటల్ హోటల్ లో పెట్టడం ఈమూవీ నిర్మాతలు చేసిన వ్యూహాత్మక తప్పు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. జూనియర్ నుండి సోలో హీరోగా సినిమా వచ్చి 6 సంవత్సరాలు దాటిన పరిస్థితులలో తారక్ అభిమానులు ‘దేవర’ కోసం చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.


దీనితో కేవలం హైదరాబాద్ నుండి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి కూడ అనేకమంది వేలాది సంఖ్యలో అభిమానులు రావడంతో నోవాటల్ హోటల్ లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం ఏమాత్రం సరిపోవక పోవడంతో ఒక రకమైన అలజడి ఏర్పడి తొక్కిసలాటకు దారి తీసింది అని అంటున్నారు. ఈఅనుకోని పరిణామానికి ఈమూవీ నిర్మాతలు అదేవిధంగా ఈమూవీ ఫంక్షన్ ఈవెంట్ మేనేజర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి చేయి జారిపోవడంతో విధిలేని పరిస్తితులలో ఈమూవీ ఫంక్షన్ ను రద్ధు చేయవలసి వచ్చింది అని అంటున్నారు.


జూనియర్ కు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫంక్షన్ రామోజీ ఫిలిమ్ సిటీలో ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదనీ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఫంక్షన్ క్యాన్సిల్ కావడంతో అభిమానుల కంటే తారక్ చాల ఎక్కువగా షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. జూనియర్ కలక్షన్ స్టామినాకు పరీక్షగా మారిన ‘దేవర’ కు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం ఒకవిధంగా అనుకోని దురదృష్టకర సంఘటన అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: