బిగ్ బాస్ షో గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ షో స్టార్ట్ అయింది అంటే చాలు... బుల్లితెర ప్రేక్షకులు తమ పనులు మానేసి మరి టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. మరి ముఖ్యంగా యువతి యువకులు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు కొంతమంది సామాజిక ఉద్యమకారులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు. అయితే ఆయా విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది.

గత ఏడవ సీజన్ తో పోల్చుకుంటే నడుస్తున్న ఎనిమిదవ సీజన్ కార్యక్రమం కొన్ని విలువలతో కూడుకొని నడుస్తున్నట్టు కనబడుతోంది. గతంలో కొంచెం శృంగార పరమైన సన్నివేశాలు ఎక్కువగా కనబడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరి పని వారు చేసుకుంటూ ఎవరి ఆటవారు ఆడుకుంటున్నారు. అయితే వీరిలో అబ్బాయి నవీన్ కాస్త తేడాగా అనిపించడంతో, మధ్యలోనే తనని ఎలిమినేట్ చేసేసారు.

ఈ నేపథ్యంలోనే అభయ నవీన్ రెమ్యూనరేషన్ గురించి పలు రకాల వార్తలు వస్తున్నాయి. అభయ నవీన్ రోజుకి 29 వేల రూపాయలు రెమినరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన మూడు వారాలకి సరిగ్గా ఆరు లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు విశ్వసినీ వర్గాల సమాచారం. ఇకపోతే అవే నవీన్ ఎలా ఎలిమినేట్ అయ్యాడో అందరికీ తెలిసిందే. తన నోటి దురుసు కారణంగానే అభయ నవీన్ బిగ్ బాస్ ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో బిగ్ బాస్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి బయటికి పంపించేసాడు.  అయితే ఈ విషయం పైన అభయ్ నవీన్ అభిమానులు కాస్త గుర్రుగా ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఓ తెలంగాణ బిడ్డ, పైగా సిద్దిపేట కి చెందిన మా జాతి రత్నాన్ని ఎలిమినేట్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారని సమాచారం. దీనిపై మీ కామెంట్ ఏమిటో కింద తెలియజేయండి!

మరింత సమాచారం తెలుసుకోండి: