97వ ఆస్కార్ అవార్డ్ నామినేషన్ కి ప్రస్తుతం రంగం సిద్ధమయ్యింది.. 2025 మార్చి 2న జరగబోయే ఈవెంట్ కి సంబంధించి చాలా దేశాల నుంచి వారు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. చాలా దేశాల నుంచి సినిమాలు కూడా ఆస్కార్ బరిలో నిలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర సమాచారం, పౌర సంబంధాలకు సంబంధించిన శాఖ అలా వచ్చిన వాటిని స్క్రీనింగ్ చూసి పలు భాష చిత్రాలను ఎంపిక చేయడం జరుగుతుందట. తెలుగు మలయాళం, కన్నడ, తమిళ్ ,హిందీ ,మరాఠీ, బెంగాలీ వంటి భాషలకు చెందిన చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో నిలువబోతున్నాయి.
వైరల్ గా మారుతున్న సమాచారాన్ని బట్టి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ,ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన కల్కి సినిమా.. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమా.. అలాగే డైరెక్టర్ అజయ్ భూపతి, పాయల్ కాంబినేషన్లో వచ్చిన మంగళవారం సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలవబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇవి కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రాలు.. ఇతర భాషలలో నుంచి కూడా చాలా చిత్రాలే ఆస్కార్ బరిలో పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆస్కార్ అవార్డు ఎవరిని వరిస్తుందో చూడాలి.