అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోవచ్చు. అంతకు మించిన సినిమాల్లో ఆయన ఇపుడు నటించొచ్చు. కానీ అతని సినిమా కెరీర్‌ని 'ఆర్య' అనే సినిమా సమూలంగా మార్చివేసింది అని మీలో ఎంతమందికి తెలుసు? గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అసలు వీడు సినిమా హీరోనా? అని అప్పటి ప్రేక్షకులు పెదవి విరిచేవారు. ఇంకా చెప్పాలంటే ఓ మగాడికి తక్కువ, ఆడదానికి ఎక్కువ అన్న మాదిరిగా ఉన్నాడు.. అని కామెంట్స్ బాగా వినబడేవి. అయితే కట్ చేస్తే, ఆర్య అనే సినిమాతో ఒక్కసారిగా బన్నీ స్టార్‌గా మారాడు. అతని పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారకుడు మాత్రం లెక్కల మాస్టారు.. సుకుమార్ అని చెప్పుకోవాలి. అందుకే వారి బాండింగ్ నేటికీ చెక్కు చెదరకుండా కొనసాగుతోంది.

ఇక అసలు విషయంలోకి వెళితే... ఈ సినిమాలో దర్శకుడు సుకుమార్, ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. యూత్‌ను తెగ ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా అప్పట్లోనే రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ చుట్టూ కొంతమంది పిల్లలు మనకి కనిపిస్తూ ఉంటారు. పైన ఇచ్చిన ఫోటోలో బన్నీ పక్కన ఉన్న పాపను గుర్తు పట్టారా? ఆర్య సినిమాలో బాలనటిగా కనిపించిన ఆ చిన్నది.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయిందని మీలో ఎంతమందికి తెలుసు? తను మరెవరో కాదు శ్రావ్య. లవ్ యు బంగారం సినిమాతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించింది శ్రావ్య.

అంతేకాదండోయ్... హీరోయిన్ శ్రావ్య కన్నడ సినిమాలో కూడా చేసింది. కన్నడలో రోజ్‌తో పాటు తెలుగులో కాయ్ రాజా కాయ్, సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా చేసిన నందిని నర్సింగ్ హోం మూవీలో కూడా హీరోయిన్ గా నటించి, మెప్పించింది. ఇక తమిళంలో విషయానికొస్తే... పగిరి, విలాయట్టు ఆరంభం మూవీస్ చేయగా ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్లగా నిలిచాయి. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చేయడం లేదని టాక్. అయితే సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. తన అందమైన ఫోటోలతో తాజాగా ఆమె సోషల్ మీడియాని పలకరించింది. మరెందుకాలస్యం, తన లేటెస్ట్ లుక్ ఫోటో చూసేయండి!

మరింత సమాచారం తెలుసుకోండి: