తెలుగు సినీ ప్రేక్షకులకి మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు గత నాలుగు దశాబ్దాల నుంచి కూడా తెలుగు ప్రేక్షకులు అందరినీ అలరిస్తూ స్టార్ హీరోగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ఏకంగా ఇండస్ట్రీని ఏలేసే స్థాయికి ఎదిగారు. ఇక ఇప్పుడూ సినిమానే ప్రపంచంగా బ్రతుకుతున్న ఎంతోమంది యువకులకు మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపించింది అంటే చాలు ఆయన నటన ఫైట్స్ తో పాటు ఆయన చేసిన డ్యాన్సులు గుర్తుకు వస్తూ ఉంటాయి. అయితే ఏకంగా ఇతర హీరోలతో పోల్చి చూస్తే అద్భుతమైన డాన్సులు చేయడమే మెగాస్టార్ చిరంజీవిని టాప్లో నిలిపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1979లో చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు ప్రేక్షకుల మెగాస్టార్ గా మారిపోయారు.


 అయితే మెగాస్టార్ తర్వాత ఎంతోమంది చిత్ర పరిశ్రమలోకి వచ్చినా ఆయన రేంజ్ అందుకోలేకపోయారు. అయితే మెగాస్టార్కు కెరియర్ మొదట్లో మాత్రం ఒక హీరో గట్టి పోటీ ఇచ్చాడట. ఆయన ఎవరో కాదు సుమన్. ఓ ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. చిరంజీవికి పోటీగా వెళ్లాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక సమయంలో నేను మెగాస్టార్ ని అయ్యాను. నువ్వు కావాల్సింది అని చిరంజీవి మీతో అన్నట్లు తెలిసింది నిజమా అంటూ యాంకర్ ప్రశ్నించింది. ఆయన నాతో ఆయన ఎప్పుడూ అనలేదు. నేను చిరంజీవికి కాంపిటీషన్ అని కూడా అనుకోలేదు. కానీ తెలియకుండానే చిరంజీవికి కాంపిటీషన్ అయ్యాను. చిరంజీవితో పాటుగా నేను ఫైట్స్ యాక్టింగ్ చేస్తున్నాను. కానీ ఆయన మంచి డాన్సర్ దీంతో చిరంజీవికి ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఆ ఒక్కటే ఆయనను మెగాస్టార్ ను చేసేసింది అంటూ సుమన్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: