టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా, అలాగే సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న దేవర ఈ నెల సెప్టెంబర్27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌ హైటెక్స్‌లోని నోవాటెల్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ కేవలం 5వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉంది. కానీ పరిమితికి మించి అభిమానులు రావడంతో వేదిక ప్రాంగణంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సుమారు 15 వేలకు మంది పైగానే అభిమానులు చొచ్చుకుని వచ్చారు. పోలీసులు నిలువరించినా ఫలితం లేకపోయింది. దీంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్గనైజర్స్.దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకులోనయ్యారు. ఇదిలావుండగా ఎన్టీఆర్ ఈ విషయం పై స్పీచ్ ఇచ్చారు. అక్కడి వరకు ఓకే గాని…చిత్ర యూనిట్ సెంటిమెంట్ భయంతోనే ఈవెంట్ ను రద్దు చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వెనుక ప్రీ ప్లాన్ ఉందంటున్నారు జనాలు. అసలు ఏంటి ఆ సెంటిమెంట్ అనేది చూద్దాం. సరిగా 11 ఏళ్ళ క్రితం… అంటే 2013 సెప్టెంబర్ 22వ తేదీన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్య సినిమా ట్రైలర్ విడుదల అయింది.

సరిగా అదే రోజున అంటే… 22 సెప్టెంబర్ న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి, ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేసారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది అప్పుడు. ఇప్పుడు ఆ భయం వెంటాడి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమో అనే భయంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసి ఉంటారని అంటున్నారు సినీ జనాలు. అందుకే ఈవెంట్ లో కాకుండా మధ్యాహ్నమే ట్రైలర్ విడుదల చేసారని టాక్. సాధారణంగా రిలీజ్ ట్రైలర్ ను ఈవెంట్ లో విడుదల చేస్తారని, రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించే ప్లాన్ చేసారని టాక్ వచ్చింది. కాని ముందే విడుదల చేసారు. అసలు ఈవెంట్ కి ఎవరు వస్తున్నారో కూడా క్లారిటీగా చెప్పలేదు. సాధారణంగా ఎవరు వస్తున్నారో ముందే వార్తలు వస్తాయి. కాని ఈ సినిమాకు మాత్రం అలా జరగలేదు. ముందు అనుకునే క్యాన్సిల్ చేసారని మండిపడుతున్నారు జనాలు.ఇదిలా ఉండగా తారక్ కూడా తెలుగు ప్రమోషన్స్ ను పక్కన పెట్టేసి అమెరికా బయలుదేరాడు. అక్కడ ప్రమోషన్స్ నిర్వహించి ఈ నెల 27న ఉదయం హైదరాబాద్ రానున్నాడు. సో తెలుగులో ఇక దేవరకు సంబంధించి ఏ ఈవెంట్ లేనట్టే. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ ను మనోవేదనకు గురి చేస్తుంది. అప్పట్లో యంగ్ టైగర్ నటించిన కంత్రి తర్వాత తారక్ సినిమాకు ఏ ఈవెంట్ లేకుండా వస్తున్న సినిమా ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి: