భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లేవల్లో సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ కు సిద్ధమయ్యింది. ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు.. పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని గడిచిన రెండు రోజుల క్రితం భారీ ఎత్తున ప్లాన్ చేయగా అక్కడికి అభిమానులు అనుకోని విధంగా ఎక్కువ రావడంతో వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు, యాజమాన్యం చేతులెత్తేయడంతో ఆ ఈవెంట్ ని రద్దు చేశారు.


దీంతో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని అభిమానుల సైతం చాలా నిరుత్సాహంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్నో విషయాలను పంచుకోవాలనుకున్న జూనియర్ ఎన్టీఆర్ అది కుదరలేకపోయిందట.కానీ అభిమానుల కోసం దేవర సక్సెస్ మీట్ నీ భారీ ఎత్తున సినిమా విడుదలైన  ఒక వారం రోజుల తర్వాత దసరా పండుగకు ఆటో ఇటు పెట్టేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ముఖ్యంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో అభిమానులతో పాటు ఎన్టీఆర్ కూడా నిరుత్సాహంతో ఉన్నానంటూ ఒక వీడియో ద్వారా అభిమానులకు సందేశాన్ని పంపారు.


వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దేవర చిత్రాన్ని ఎక్కువ థియేటర్లో విడుదల చేసేలా అభిమానుల కోసం ప్లాన్ చేస్తున్నారు.. అలాగే సక్సెస్ మీట్ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్గనైజేషన్ ని చూసుకోవాలంటు ముందుగానే ఎన్టీఆర్ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా ఆంధ్రావాలా ఈవెంట్ ని కూడా ఇలాగే క్యాన్సిల్ చేశారట.. ఇప్పుడు మళ్లీ దేవర సినిమా విషయంలో ఇదే జరగడం జరిగింది..దేవర సక్సెస్ మీట్ తో తన అభిమానులతో పంచుకోవాల్సిన విషయాలపైన మాట్లాడడానికి ఎన్టీఆర్ సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. ఈ సక్సెస్ మీట్ కి పలువురు సెలబ్రిటీలతో ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: