తిరుమల లడ్డూ కల్తీ కి గురైందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఈ ఎలివేషన్ చేస్తున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను తప్పు చేయకపోయినా తనను క్షమించాలంటూ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నారు. వేరే వాళ్లు చేసిన తప్పుకు తనను క్షమించాలి అని, గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని తనకు ఇవ్వమని కూడా వేడుకుంటున్నారు. చాలా పెద్ద తప్పు జరిగిన నేపథ్యంలో ఆ తప్పును క్షమించాలంటూ ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అని పవన్ అంటున్నారు.

అంతే కాదు ఆయన 11 రోజులు పాటు ప్రాయశ్చిత్త దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్ష చేస్తే ఎంత పెద్ద తప్పు చేసినా దేవుడు క్షమించేస్తాడా? తప్పు చేసిన వారందరూ ఈ దీక్ష చేసి ఆ తర్వాత ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా బతికేయవచ్చా? అనే కోణంలో ప్రస్తుతం సందేహాలు మొదలయ్యా. ప్రాయశ్చిత్త దీక్ష అందరికీ వర్తిస్తుందని మరి కొంతమంది పేర్కొంటున్నారు. అలాంటప్పుడు జానీ మాస్టర్ అనేటోడు కూడా ఇదే దీక్షలో కూర్చుంటే అయిపోతుంది కదా అతనిని జైల్లో వేయడం ఎందుకు అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.

21 ఏళ్ల మహిళా సహోద్యోగిపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అలిగేషన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అతనిపై కంప్లైంట్ నమోదైన కొన్ని రోజుల తర్వాత గోవాలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ లేడీ కొరియోగ్రాఫర్‌ తనకు పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడే జానీ మాస్టారు ముంబైలో రేప్ చేశాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకు తరలించారు.

2019 నుంచి తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులు చేస్తున్నాడని ఆమె వాపోయింది. ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడట. తన లైంగిక కోరికలు తీర్చనని ఆమె చెబితే సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించేవాడట. ఆమె వాంగ్మూలం తీసుకున్న తర్వాత జానీపై సెక్షన్ 376తో పాటు 323, 506తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. నార్సింగి పోలీసులు ఆ లేడీ కొరియోగ్రాఫర్ చెప్పిన ఆరోపణలకు మద్దతుగా పక్కా ఆధారాలు సేకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జాని మాస్టర్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే అయిపోయింది కదా అని మరి కొందరు పవన్ కళ్యాణ్ ని ఇందులోకి లాగుతున్నారు. పవన్ కళ్యాణ్ కి జానీ మాస్టర్ పెద్ద అభిమాని. ఆయన జనసేన పార్టీకి చెందినవాడు. జనసేన నాయకుడు అలా చేశాడు కాబట్టి ఇతడి శిష్యుడు కూడా దీక్ష చేసి తన పాపాలను ప్రక్షాళన చేసుకోవచ్చు అని కదా పలువురు కామెంట్ చేస్తున్నారు. అంటే ఈ ప్రాయశ్చిత్త దీక్షకు విలువ లేదని వాళ్లు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: