కొంత మంది హీరోలు సినిమాలోని పాత్ర కోసం చాలా కష్ట పడుతూ ఉంటారు. ఒక సినిమాలో ఒక పాత్ర ఉంది అంటే దాని కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న నటులు కూడా ఎంతో మంది ఉన్నారు. అలా ఆ సినిమా కోసం , పాత్ర కోసం ఎంతో కష్టపడిన తర్వాత ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంటే వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అదే మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినట్లు అయితే వారి కష్టం మొత్తం వేస్ట్ అవుతుంది. అలా అల్లు అర్జున్ కెరీర్ లో కూడా ఓ సినిమా విషయంలో జరిగింది. ఆ సినిమా ఏది ఏమిటి అనుకుంటున్నారా ... కొంత కాలం క్రితం అల్లు అర్జున్ , వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో అను ఇమ్మాన్యూయల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇక ఆర్మీ ఆఫీసర్ పాత్ర అనగానే అల్లు అర్జున్ కచ్చితంగా ఈ పాత్ర కోసం చాలా కష్టపడాలి అని డిసైడ్ అయ్యాడట. దానితో పర్ఫెక్ట్ ఆర్మీ లుక్ లో ఉండడం కోసం ఆరు నెలల పాటు అమెరికాకు వెళ్లి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడట. అలా ఆరు నెలల పాటు ఈ సినిమాలోని లుక్ కోసం ఎంతో కష్టపడి ఆ తర్వాత సినిమా షూటింగ్లో కూడా ఎన్నో కష్టాలను ఎదురుకున్న అల్లు అర్జున్ కు ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని మిగిల్చింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. దానితో ఆరు నెలల పాటు ఆర్మీ ఆఫీసర్ లుక్ లో కనిపించడం కోసం అల్లు అర్జున్ పడిన కష్టం అంతా వృధా అయ్యింది. ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: