యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు జాన్వి అనేక సినిమాలలో నటించిన ఏ కమర్షియల్ సినిమా ద్వారా కూడా ఈమెకు బ్లాక్ బస్టర్ విజయం దక్కలేదు. దానితో ఈమె నటించిన భారీ అంచనాలు కలిగిన కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఈ ముద్దుగుమ్మ భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తుంది.

మూవీ నుండి ఇప్పటి వరకు మూవీ మేకర్స్ రెండు ట్రైలర్లను విడుదల చేశారు. ఈ రెండు ట్రైలర్లను బట్టి చూస్తే జాన్వీ కపూర్ పాత్ర ఈ సినిమాలో భారీ స్థాయిలో ఉండదు అని చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకు అనుగుణం గానే చాలా మంది కూడా ఈ సినిమాలో జాన్వీ కపూర్ కి పెద్ద స్థాయిలో గుర్తింపు కలిగే పాత్ర ఉంటుందా లేదా అని అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇకపోతే చాలా మంది ఈ ముద్దుగుమ్మ పాత్ర ఫస్టాఫ్ లో ఉంటుంది.

ఆ తర్వాత ఈమె పెద్దగా కనిపించదు అనే విశ్లేషణలను చాలా మంది జనాలు ముందుకు తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముద్దు గుమ్మ సినిమా ఫస్ట్ స్టాప్ లో ఏ మాత్రం ఉండదు అని , సెకండాఫ్ లోని ఈ బ్యూటీ ఎంట్రీ ఉంటుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. అదే జరిగితే విశ్లేషకుల అంచనాలు తారుమారు అయినట్టే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: