ప్రొడ్యూసర్ స్రవంతి రవికుమార్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ పోతినేని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మిడ్ రేంజ్ హీరోలలో ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ ఆడియన్స్ లో గుర్తింపును సంపాదించుకున్న వారిలో రామ్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో రామ్ హీరోగా వచ్చిన దేవదాసు మూవీ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అతను ఎనర్జీకి ఫాన్స్ ఫిదా అయిపోయారు. అందుకే ఎనర్జిటిక్ స్టార్ అంటూ పిలుచుకోవడం మొదలుపెట్టారు.


 అయితే ఇలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రామ్ టాలెంట్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. కొత్త కుర్రాడు అయినా యాక్టింగ్ డాన్స్ ఫైట్స్ అదరగొట్టేస్తున్నాడు. ఇక రాను రాను ఇతను ఇండస్ట్రీలో స్టాప్ హీరో అవడం ఖాయం అని అనుకున్నారూ. ఇక అతనికి సూపర్ హిట్లు పడటంతో తిరుగులేదు అని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. కానీ గత కొంతకాలం నుంచి మాత్రం రామ్ చేసిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వట్లేదు. పాజిటివ్ టాక్ వచ్చిన యావరేజ్ గానే మిగిలిపోతుంది. రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు ఎంత ఘోరమైన ఫ్లాప్స్ చవిచూసాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 అయితే ఇండస్ట్రీలో సక్సెస్ ను బట్టి పారితోషికం కూడా కొనసాగుతూ ఉంటుంది.  కానీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ పోతినేని పారితోషకం విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదట. పాతిక కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్  అడుగుతున్నాడట. అయితే ప్రస్తుతం వరుస ప్లాపులతో ఉన్న రామ్ కు మార్కెట్ అంత లేదు. ఒక ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక్కటే 35 కోట్ల రూపాయలకు పైగా షేర్లు వచ్చాయి. మిగిలిన ఏ చిత్రాలకు 25 కోట్లు దాటలేదు. అలాంటి రామ్ పోతినేని రెమ్యూనరేషన్ అంతలా అడగడం అస్సలు న్యాయంగా లేదని నిర్మాతలు కూడా పారిపోతున్నారట. మరి ఇలా అయితే రామ్ కి ఫ్యూచర్లో సినిమా ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: