అవును, పరిశీలిస్తే మహేష్ కొత్త గెటప్ ఇంచుమించు అచ్చుగుద్దినట్టు అలానే ఉంది. కీనూ రీవ్స్ ఇటీవల ఒక కొత్త హెయిర్ స్టైల్ తో అభిమానులను అలరించిన సంగతి విదితమే. భారీ యాక్షన్ చిత్రం 'జాన్ విక్'లో అతడి రూపం పెద్ద చర్చనీయాంశమైంది కూడా. ఇప్పుడు రాజమౌళి - మహేష్ బాబు బృందం దానినే కాపీ చేసి పెట్టారా? లేదంటే మహేష్ న్యూలుక్ కి అతడే ప్రేరణ అనుకోవాలా? అంటూ ఒకటే రచ్చ మొదలైంది. కీనూ స్టైలిష్ లుక్, అద్భుతమైన నట ప్రదర్శన గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాన్ విక్ లో అతడు ఆ లుక్కులో ఇరగదీసాడు. అందుకే మహేష్ బాబు అతడి స్ఫూర్తితో అదే రూపంతో కనిపిస్తుంటే ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు కానీ క్రిటిక్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు.
అయితే అభిమానులు మాత్రం తమ హీరోని చూసి ఖుషీ అయిపోతున్నారు. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం సూపర్‌స్టార్ మహేష్ బాబు తీసిపోడు అంటూ కితాబిచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు కీనూ రీవ్స్ ఫోటోని చూపిస్తూ 'ఎవడ్రా జాన్ విక్... నాకు కళ్ళు బానే కనిపిస్తున్నాయి' అంటూ స్పందించగా మహేష్ బాబు టామ్ క్రూజ్ ని మించిపోయాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఒక పాపులర్ హాలీవుడ్ స్టార్ తో మహేష్ బాబును పోలుస్తున్నారంటే, అతడు తన కొత్త సినిమా కోసం తీసుకుంటున్న శ్రద్ధను ప్రశంసించాలి. అదే విషయంలో రాజమౌళి కాపీ కాకుండా ఏది చేసినా ఒక ట్రెండ్ సృష్టిస్తే బావుంటుందని క్రిటిక్స్ ఫీల్ అవుతున్నారు.