ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన పని లేదు. మైదానంలో బంతిని బ‌లంగా బౌండ‌రీలు అవతలికి పంపించడంలో డేవిడ్ ఎంతటి ప‌నిమంతుడో, అల్లు అర్జున్ పాట‌ల‌కు డ్యాన్సులు వేయ‌డంలో కూడా అంతే పనిమంతుడు అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ తెలుగు ఆడియెన్ కి, డేవిడ్ ముఖ్యంగా బ‌న్ని న‌టించిన పుష్ప సినిమాలో పాట‌ల‌కు స్టెప్పులేసిన తరువాత అత్యంత చేరువ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే అత‌డిని మ‌న‌వాళ్లు బాగా అనుసరిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు.

ఇకపోతే, వార్న‌ర్ స్ఫూఫ్ వీడియోలు అనేకం అప్పుడప్పుడూ ఇంట‌ర్నెట్లో హల్ చల్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా వార్న‌ర్ మాఫియా డాన్ గా మారి గ‌న్ తో ఫైట్ చేస్తున్న కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దాంతో ఉన్న‌ట్టుండి ఈ వేషం ఏమిటి? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. దాంతో అతడి వేష‌ధార‌ణను చూసిన కొందరు అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప 2లో కానీ న‌టిస్తున్నాడా? అనే వార్తలు వచ్చాయి. కానీ అత‌డు న‌టిస్తున్న సినిమా రాబిన్ హుడ్. నితిన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న 'రాబిన్‌హుడ్'లో అతిధి పాత్రతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడ‌ట‌ డేవిడ్ వార్నర్.

అదీ.. అసలు విషయం! ఛలో, భీష్మ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వార్నర్ తన సినిమా సన్నివేశాల కోసం ఆస్ట్రేలియాలో షూట్ చేస్తున్న ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేయడంతో ఈ సినిమాకి కావలసినంత ఎక్సపోజ్ వచ్చించి. మాజీ ఆసీస్ ఓపెనర్ అయిన వార్న‌ర్ తెలుగు సినిమాకి గొప్ప‌ అభిమాని అన్న సంగతి అందరికీ తెలిసినదే. డేవిడ్ పుష్ప, అల వైకుంఠ‌పుర‌ములో, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల పాట‌ల‌కు అద్భుతంగా డాన్స్ చేసిన సంగతి విదితమే. బ‌న్నీ ఎక్స్ ప్రెష‌న్స్, డ్యాన్సుల‌ను, మ్యానరిజమ్‌లను అనుకరిస్తూ టిక్‌టాక్ రీల్స్ చేసాడు. అక్కడి నుండే డేవిడ్ సగటు తెలుగువాడిలా మారిపోయాడు. కాగా రాబిన్ హుడ్ లో శ్రీ‌లీల న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నితిన్ వ‌రుస‌గా తమ్ముడు, రాబిన్‌హుడ్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: