చాలామంది నేతలు కూడా అసలు ఎన్టీఆర్ సినిమాలను పట్టించుకోమని తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు దేవర సినిమా మరో మూడు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే తమని తాము సపోర్ట్ చేసుకుంటూ ఓన్ గా ముందుకు వెళ్తున్నారు. ఈ ఇద్దరి అన్నదమ్ముల సినిమాకి ఇద్దరు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఉన్న విషయాన్ని అభిమానులు గుర్తించి అభిమానులు కూడా వీరికి సపోర్టుగా నిలబడుతూ ఉన్నారు.
ఇటీవల దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేయగా కొన్ని కారణాల చేత ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు దేవర సినిమా భారమంతా కూడా ఈ నందమూరి బ్రదర్స్ మీదే ఆధారపడింది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ దేవర సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయాన్ని అందుకుంటే కచ్చితంగా వీరి క్రేజ్ మరో లెవెల్ కి ముందుకు వెళుతుందని చెప్పవచ్చు. మరి ఇంతటి భారాన్ని ఈ నందమూరి బ్రదర్స్ మోయగలరా అనే అనుమానం కూడా యాంటీ ఫ్యాన్స్ కి తడుతోంది. కానీ కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో దేవర సినిమాని గట్టెక్కించుకుంటారో లేదో చూడాలి. సెప్టెంబర్ 27న విడుదల కోసం ఎదురు చూడకు తప్పదు.