యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. అటు యూఎస్‌లో ప్రత్యంగిరా సినిమాస్, హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దేవర మూవీకి సంబంధించి బుకింగ్స్ స్టార్ట్ చేయగా నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్ అయ్యాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని చుట్టూరా అన్ని థియేటర్లలో 7 షోస్ ప్రదర్శించనున్నారు మేకర్స్. అలాగే చుట్టూరా ఉన్న 7 థియేటర్లలలో..46 షోస్ దేవర సినిమాను ప్రదర్శించనున్నారు.ఈ షోస్ గ్రాస్ అటు ఇటుగా రూ.1.25 కోట్లు గా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. అయితే, దీన్ని బట్టి చూస్తుంటే డే 1 కలెక్షన్స్ భారీ రేంజ్లో సాధించడం అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రలోనే మొదటి సారి.ఇకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని అన్ని థియేటర్లలో గత సినిమాల కలెక్షన్స్ విషయానికి వస్తే.. డే 1 హయ్యెస్ట్ కలెక్షన్స్ ప్రభాస్ కల్కి రూ. 87 లక్షలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.రెండవ స్తానం లో మహేష్ బాబు గుంటూరు కారం రూ.82లక్షలు, rrr మూవీ రూ. 75.87 గా ఉన్నాయి.

కాగా ఇప్పుడు దేవర సినిమాకు వస్తోన్న హైప్, ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాల్లోవింగ్ దృష్ట్యా గత లెక్కలన్నీ బ్రేక్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇది కనుక సాధిస్తే..ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవర ట్రెండ్ మొదలైనట్టే.ఇదిలావుండగా గురువారం అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోలు మొదలు కానున్నాయి. హైదరాబాద్ లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించాలని చిత్రబృందం నిర్ణయం తీసుకొంది. టికెట్ రేటు కనీసం రూ.2 వేలు ఉంటుందని ఓ అంచనా. అయినా సరే, హాట్ కేకుల్లా అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిరోజే దాదాపుగా రూ.150 కోట్ల వసూళ్లు సాధించాలన్నది దేవర టార్గెట్. ఈ ఊపు చూస్తుంటే అదేం పెద్ద విషయం కాదనిపిస్తోంది. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా, దేవర కొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.దీంతో మూవీపై సూపర్ హైప్ క్రియేట్ అయింది. సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తారక్ సరసన తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: