ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన పేక్షకుల ముందుకు రావడానికి మేకర్స్ రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ ముందుగానే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే నిన్న అనగా సోమవారం సాయంత్రం నుంచి సినిమా టికెట్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.


అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో అదనపు షోలకు రెండు ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. టికెట్ ధర కూడా పెరిగిందనే చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొదటి రోజు టికెట్ ధరను వంద రూపాయలకు పెంచారు. అయినా సరే అభిమానులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా టికెట్లు కొనడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.... ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర చిత్రాన్ని ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు ఈ తరుణంలోనే తమిళనాడులో సైతం ఎన్టీఆర్సినిమా ప్రమోషన్స్ ను నిర్వహించారు.


తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ కాపీ చేశారనే కామెంట్లు తెర మీదకు వస్తున్నాయి. ఈ కామెంట్లు చేసింది మరెవరో కాదు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్. తాను హక్కులు పొందిన ఓ ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా ఈ సినిమాలో పెట్టారని శంకర్ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ మెరకు సోషల్ మీడియాలో శంకర్ పోస్ట్ పెట్టడం జరిగింది.


కాపీ రైట్స్ నిమిత్తం కేసు పెడతానంటూ శంకర్ నుంచి ఓ అధికారిక ప్రకటన వచ్చింది. లేటెస్ట్ సినిమా ట్రైలర్ లోని ఓ ముఖ్యమైన సీన్ ను వాడేసారు. అది చూసి నాకు చాలా బాధేసింది. నా నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్ సిరీస్ ఇలా ఏ ఇతర ప్లాట్ ఫామ్ లోనైనా వినియోగించడం దయచేసి మానుకోండి అంటూ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పోస్ట్ చేసింది ఎన్టీఆర్ దేవర సినిమా గురించే అనే చర్చ సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: