జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరు సంవత్సరాలు గడిచిపోతుంది. ఆఖరుగా జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" అనే సినిమాలో హీరోగా నటించి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కి దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా సోలో హీరోగా నటించిన అరవింద సమేత విడుదల ఆటి ఇప్పటికే ఆరు సంవత్సరాలు అవుతుంది. దానితో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మూవీ పై ప్రేక్షకుల్లో ఇండియా వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సత్యం సుందరం" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం వారు తెలుగులో ఓ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో కార్తీ మాట్లాడుతూ ... దేవర సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. మా సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల కానుంది .

ఇక మా మూవీ ని తెలుగు లో ఏసియన్ సురేష్ సంస్థలు విడుదల చేయబోతున్నాయి. మా మూవీ లో పెద్దగా కమర్షియల్ అంశాలు ఏమీ లేవు. ఆయన వారు మా సినిమాను కొనడానికి ముందుకు వచ్చారు. నేను వారితో ఆ విషయం చెప్పాను మా సినిమాలో కమర్షియల్ అంశాలు లేవు అని , మాకు తెలుసు ఈ సినిమా ఒక ఎమోషనల్ మూవీ అని కొనడానికి వారు ముందుకు వచ్చారు. దానితో నేను షాక్ అయ్యాను అని కార్తీ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: