"దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి" అనే నానుడి తెలుగు హీరోయిన్లకు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హీరోల లెక్క వేరు, హీరోయిన్ల లెక్క వేరే ఉంటుంది. అవకాశాలు వచ్చినపుడే అందిపుచ్చుకొని టాప్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకొని క్యాష్ చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తే ఉండదు! అందుకే ఇక్కడ మీడియం రేంజ్ హీరోయిన్లు అనబడేవారు కొందరు టాప్ ప్లేస్ కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నట్టు కనబడుతోంది. ఒకరో ఇద్దరో కాదండీ.. అరడజన్ మందికి పైగా బ్యూటీస్ పోటీ పడుతున్నారు.

ఈ లిస్టులో అందరి కంటే కూడా ముందు వరుసలో ఉన్నది, మీనాక్షి చౌదరి. వరస సినిమాలతో టాప్ రేస్‌లోకి వచ్చారు మీనాక్షి. ఈమె వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాతో పాటుగా వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, లక్కీ భాస్కర్, విశ్వంభర సినిమాల్లో కూడా ఆమెనే హీరోయిన్ అని మీకు తెలుసా? ఇలా ఆమె జూనియర్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు అందరితో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉంది. నిన్న మొన్నటి వరకు టాప్ ప్లేసులో ఉన్న కుర్ర హీరోయిన్ శ్రీలీల ఈ రేసులో వెనకబడినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒకటి అరా మినహా, ఈ అమ్మడి నుండి పెద్ద సినిమాలేమీ కనబడడం లేదు.

మీడియం రేంజ్‌లో చూసుకుంటే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా రేసులోనే ఉన్నట్టు కనబడుతోంది. మిస్టర్ బచ్చన్‌తో పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌తో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె కన్ను మాత్రం టాప్ ప్లేసుపైనే ఉందని సమాచారం. ఇక నభా నటేష్ సైతం నిఖిల్‌తో స్వయంభు సినిమాల్లో నటిస్తూ టైర్ 2లో టాప్ ప్లేస్ కోసం చూస్తున్నారు. అదే విధంగా సాయి మంజ్రేకర్ నిఖిల్‌తో ది ఇండియా హౌజ్ సినిమాతో తన సత్తా చాటే పనిలో పడింది. ఆమె ఈ మధ్య బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటించారు. అదేవిధంగా తెలుగమ్మాయిలు రితూ వర్మ, వైష్ణవి చైతన్య సైతం మీడియం రేంజ్‌లో టాప్ ప్లేస్ రేసులోనే ఉన్నారు. వీరు కూడా టాప్ ప్లేసు కోసమే గేలం వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: