కొన్ని రోజుల క్రితం రాజ్ కుమార్ రావు హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా "స్త్రీ 2" అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక కొంత కాలం క్రితం స్త్రీ అనే మూవీ విడుదల అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను వసూలు చేయడంతో "స్త్రీ 2" మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ మూవీ పై హిందీ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ కొంత కాలం విడుదల అయిన ఈ సినిమాకు రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ వరల్డ్ వైడ్ గా దక్కింది. దానితో ఈ సినిమాకు కలెక్షన్లు అదిరిపోయే రేంజ్ లో వచ్చాయి.

ఇప్పటి వరకు ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఐదు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ 589.90 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ క్రమంలో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ఆరవ వారంలో కూడా పెద్ద మొత్తంలోనే కలక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంది. ఆరో వారం మొదలు అయిన తర్వాత ఈ మూవీ మొదటి రోజు 5.20 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇక ఐదు వారాలు ముగిసిన కూడా ఈ సినిమా ఆరోవ వారంలో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం కష్టతరం అయ్యే స్థాయి కలెక్షన్లను "స్త్రీ 2" మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. 2018 వ సంవత్సరం విడుదల అయిన స్త్రీ మూవీ కి దాదాపు 130 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక స్త్రీ మూవీ కి మించిన కలెక్షన్లు "స్త్రీ 2" సినిమాకు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: